మహేంద్ర సింగ్ ధోని.. వరల్డ్ క్రికెట్ లో మిస్టర్ కెప్టెన్ కూల్ గా పేరుగడించాడు. మైదానంలో నరాలు తెగే ఉత్కంఠత ఉన్నాగానీ.. ప్రశాంతగా మ్యాచ్ ను ముగించడం ధోనికి వెన్నతో పెట్టిన విద్య. ఇక మైదానంలో ధోని ఎంత ప్రశాంతంగా ఉంటాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంది ధోని మీరనుకునేంత కూల్ కాదు.. అందర్నీ తిట్టేవాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా వెంటరన్ పేసర్ ఇషాంత్ శర్మ. ప్రముఖ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని గురించి పలు షాకింగ్ విషయాలు వెల్లడించాడు ఇషాంత్.
మహేంద్ర సింగ్ ధోని అందరూ అనుకునేంత కూల్ కాదన్నాడు టీమిండియా వెంటరన్ పేసర్ ఇషాంత్ శర్మ. తప్పులు చేస్తే.. ఎవ్వరని చూడకుండా తిడతాడని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీతో పాటు తాను కూడా ధోని ఆగ్రహానికి గురైయ్యానని గుర్తు చేసుకున్నాడు ఇషాంత్ శర్మ. ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ధోని సైలెంట్ గా ఓ మూలన కూర్చున్నాడు అంటే.. అతను ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నాడని అర్థం. ఆ టైమ్ లో ఎవరైనా వెళ్లి డిస్టర్బ్ చేస్తే.. బండ బూతులు తిట్టేవాడని ఇషాత్ తెలిపాడు. ధోనిని అందరు మిస్టర్ కూల్ అంటారని, కానీ అతను అంత కూల్ ఏమీ కాదని చెప్పుకొచ్చాడు ఈ పేసర్. ఇక ఫీల్డర్స్ వేసిన త్రో అతడి గ్లోవ్స్ దాక వెళ్లకుంటే ధోనికి ఎక్కడ లేని కోపం వస్తుందన్నాడు. ఈ సందర్బంగా ధోని తనపై కోప్పడిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు ఇషాంత్.
అది 2013 ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో రవి బోపారా క్యాచ్ ను నేను మిస్ చేశాను. దాంతో నాపై ధోని తీవ్ర ఆగ్రహానికి గురైయ్యాడు. నువ్వు సరిగ్గా ఫీల్డింగ్ చేయకపోతే అక్కడ నిల్చోకు అంటూ అరిచాడని గుర్తుచేసుకున్నాడు. నేనే కాదు కోహ్లీ సైతం ఎన్నోసార్లు ధోని చేత తిట్లు తిన్నాడని పేర్కొన్నాడు. అయితే తిట్టిన తర్వాత.. తమ్ముడిలా భావించే అలా తిట్టానని ధోని వివరణ ఇచ్చేవాడని ఇషాంత్ శర్మ తెలిపాడు. ఆస్ట్రేలియాతో ఓ మ్యాచ్ లో శిఖర్ ధావన్ గాయపడ్డాడు. దాంతో బ్యాటింగ్ కు కోహ్లీని పంపాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ నిర్లక్ష్యంగా ఆడి అవుట్ అయ్యాడు. దాంతో ధావన్ పరిస్థితి తెలిసి కూడా ఎందుకు అవుట్ అయ్యావ్ అంటూ విరాట్ ను మందలించాడు ధోని అంటూ అప్పటి సంఘటనను గుర్తు చేశాడు ఇషాంత్.