Nidhan
Ishan Kishan, Duleep Trophy 2024, Sanju Samson: యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను బ్యాడ్ లక్ వదలడం లేదు. భారత జట్టులో చోటు కోల్పోయి ఇబ్బంది పడుతున్న అతడు రీఎంట్రీ ఇద్దామనుకుంటే దురదృష్టం అడ్డుపడింది.
Ishan Kishan, Duleep Trophy 2024, Sanju Samson: యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను బ్యాడ్ లక్ వదలడం లేదు. భారత జట్టులో చోటు కోల్పోయి ఇబ్బంది పడుతున్న అతడు రీఎంట్రీ ఇద్దామనుకుంటే దురదృష్టం అడ్డుపడింది.
Nidhan
ఎంత టాలెంట్ ఉన్నా క్రమశిక్షణ లేకపోతే క్రీడల్లో రాణించడం కష్టమే. టీమ్ మేనేజ్మెంట్తో పాటు అందరి సపోర్ట్ దొరకాలంటే బాగా పెర్ఫార్మ్ చేయడంతో పాటు డిసిప్లిన్, సిన్సియారిటీ ఉండటం కంపల్సరీ. అవి లేకపోతే నెగ్గుకురావడం కష్టమే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా టీమిండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను చెప్పొచ్చు. తక్కువ టైమ్‌లోనే భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. బీసీసీఐ మాట వినకపోవడంతో కాంట్రాక్ట్ కోల్పోయి టీమ్‌కు దూరమయ్యాడు. తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నా ఇషాన్‌ను బ్యాడ్ లక్ వెంటాడుతోంది. మంచి అవకాశాన్ని అతడు కోల్పోయాడు.
సెప్టెంబర్ 5 నుంచి మొదలయ్యే దులీప్ ట్రోఫీలో దుమ్మురేపి భారత జట్టులోకి కమ్‌బ్యాక్ ఇద్దామనుకున్నాడు ఇషాన్. పాపం.. అతడ్ని బ్యాడ్ లక్ వదలడం లేదు. గాయం కారణంగా అతడు దులీప్ ట్రోఫీ ఆరంభ మ్యాచులకు దూరమయ్యాడని తెలుస్తోంది. ఇంజ్యురీ తీవ్రత ఎంతనేది ఇంకా తెలియరాలేదు. ఒకవేళ గాయం పెద్దదే అయితే అతడు ఈ టోర్నమెంట్లో మరిన్ని మ్యాచ్‌లకు దూరం కావొచ్చు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఆడే ఛాన్స్ కొట్టేయాలని భావిస్తున్న ఇషాన్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. అయితే ఇషాన్ గాయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఇప్పుడే దీని గురించి ఏదీ చెప్పలేం. ఇక, మానసిక సమస్యలతో బాధపడుతున్నానని చెప్పి గతేడాది సౌతాఫ్రికా టూర్ మధ్యలో నుంచే స్వదేశానికి వచ్చేశాడు ఇషాన్. అయితే ఇంటి వద్ద రెస్ట్ తీసుకోకుండా ఒక పార్టీలో ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. దీంతో అతడిపై బోర్డు సీరియస్ అయింది.
భారత జట్టులోకి రావాలంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనంటూ ఇషాన్‌కు టీమ్ మేనేజ్మెంట్తో పాటు బీసీసీఐ నుంచి ఆదేశాలు వెళ్లాయి. కానీ అతడు మాట వినకపోవడంతో సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించారు. దీంతో దిగొచ్చిన ఇషాన్.. ఇటీవల జరిగిన బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో ఆడాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నీలో జార్ఖండ్ కెప్టెన్‌గా వ్యవహరించిన లెఫ్టాండ్ బ్యాటర్ సెంచరీతో మెరిశాడు. ఇదే జోరును దులీప్ ట్రోఫీలోనూ కంటిన్యూ చేసి భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. అయితే బుచ్చిబాబు టోర్నీలోనే అతడు గాయపడ్డాడని.. దులీప్ ట్రోఫీ స్టార్టింగ్ మ్యాచెస్‌కు దూరంగా ఉంటాడని సమాచారం. కాగా, గాయపడిన ఇషాన్ స్థానంలో మరో స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ఇండియా-డీ టీమ్‌లో ఛాన్స్ దక్కించుకున్నాడని తెలుస్తోంది. మరి.. ఇషాన్ ఎప్పటిలోగా కమ్‌బ్యాక్ ఇస్తాడని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
Ishan Kishan doubtful for the opening match of the Duleep Trophy due to an injury. (Cricbuzz). pic.twitter.com/TnwUCVFI5C
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 4, 2024