Ishan Kishan: జార్ఖండ్‌ టీమ్‌ కెప్టెన్‌గా ఇషాన్‌ కిషన్‌! బుచ్చి బాబు టోర్నీలో..

Ishan Kishan: జార్ఖండ్‌ టీమ్‌ కెప్టెన్‌గా ఇషాన్‌ కిషన్‌! బుచ్చి బాబు టోర్నీలో..

Ishan Kishan, Jharkhand, Buchi Babu Tournament 2024: దేశవాళి క్రికెట్‌లో ఓ ప్రతిష్టాత్మక టోర్నీలో మంచి టీమ్‌ను లీడ్‌ చేసే అవకాశం ఇషాన్‌ కిషన్‌కు వచ్చింది. మరి ఆ టీమ్‌ ఏది? ఏ టోర్నీలో కెప్టెన్‌గా ఉంటాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Ishan Kishan, Jharkhand, Buchi Babu Tournament 2024: దేశవాళి క్రికెట్‌లో ఓ ప్రతిష్టాత్మక టోర్నీలో మంచి టీమ్‌ను లీడ్‌ చేసే అవకాశం ఇషాన్‌ కిషన్‌కు వచ్చింది. మరి ఆ టీమ్‌ ఏది? ఏ టోర్నీలో కెప్టెన్‌గా ఉంటాడో ఇప్పుడు తెలుసుకుందాం..

గత కొంత కాలంగా టీమిండియా దూరమైన యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌కు గోల్డెన్‌ ఛాన్స్‌ దక్కింది. భారత జట్టులో పాకెట్‌ డైనమైట్‌గా ఎదుగుతున్న కాలంలో.. కొన్ని తప్పిదాలతో బీసీసీఐ ఆగ్రహానికి గురైన ఇషాన్‌.. టీమిండియాలో చోటుతో పాటు బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను కూడా కోల్పోయాడు. మళ్లీ టీమిండియాలోకి వచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్నా.. బీసీసీఐ కనీసం అతన్ని పట్టించుకోవడం లేదు. తాజాగా ఇషాన్‌పై కాస్త కోపం తగ్గించుకున్న బీసీసీఐ.. అతనికి మరో అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. దులీప్‌ ట్రోఫీలో అతన్ని ఆడిస్తారనే వార్తలు వచ్చినా.. ఇప్పుడు అంతకంటే బెటర్‌ ఆప్షన్‌ దక్కింది. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న బుచ్చి బాబు టోర్నీలో తన హాం టీమ్‌ జార్ఖండ్‌కు కెప్టెన్సీ వహించే అవకాశం ఇషాన్‌ కిషన్‌కు వచ్చింది.

ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు తమిళనాడులో జరిగే ప్రతిష్టాత్మక బుచ్చిబాబు టోర్నీలో జార్ఖండ్‌ జట్టును నడిపించనున్నాడు. ఇప్పటికే టీమిండియాలో పర్మినెంట్‌ ప్లేయర్‌గా ఉండాల్సిన ఇషాన్‌.. తాను చేసిన తప్పులతో భారత జట్టుకు దూరం అయ్యాడు. ఐపీఎల్‌లో ఆడుతున్నా.. పెద్దగా రాణించలేదు. పైగా టీమిండియాలో యువ క్రికెటర్లు దుమ్మరేపుతున్నాడు. యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌ను కాదని ఇషాన్‌ని ఇప్పట్లో టీమిండియాకు ఎంపిక చేసే అవకాశం లేదు. అయినా కూడా దేశవాళి క్రికెట్‌లో నిరూపించుకోవల్సిన అవసరం ఇషాన్‌కు ఉంది. ఇలాంటి సమయంలో అతనికి ఇది గోల్డెన్‌ ఛాన్స్‌ అనుకోవాలి. బుచ్చి బాబు టోర్నీలో కెప్టెన్‌, బ్యాటర్‌గా రాణిస్తే.. ఆ తర్వాత రంజీలో మంచి కాన్ఫిడెన్స్‌లో బరిలోకి దిగొచ్చు.

అందులోనూ మంచి ప్రదర్శన కనబరిస్తే.. టెస్టు జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక బుచ్చి బాబు టోర్నీలో జార్ఖండ్‌తో పాటు మరో 11 టీమ్స్‌ పాల్గొంటాయి. మ్యాచ్‌లన్నీ తమిళనాడులోనే జరుగుతాయి. నాథమ్(దిండిగల్), సేలం, కోయంబత్తూర్, తిరునెల్వేలిలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈ టోర్నీలో దేశంలోని టాప్‌ 10 స్టేట్‌ టీమ్స్‌.. మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, రైల్వేస్‌, గుజరాత్‌, ముంబై, హర్యానా, జమ్మూ కశ్వీర్‌, ఛత్తీస్‌ఘడ్‌, హైదరాబాద్‌, బరోడాతో పాటు తమిళనాడు నుంచి రెండు టీమ్స్‌ తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ ఎలెవన్‌, తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎలెవన్‌ జట్లు కూడా ఈ టోర్నీలో ఆడతాయి. ముంబై జట్టుకు టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహించనున్నాడు. మరి జార్ఖండ్‌ జట్టు కెప్టెన్‌గా ఇషాన్‌ ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments