బుచ్చిబాబు టోర్నీలో మధ్యప్రదేశ్‌పై సెంచరీ చేసిన ఇషాన్‌ కిషన్‌

Ishan Kishan, Madhya Pradesh vs Jharkhand, Buchi Babu Tournament 2024: టీమిండియా యువ క్రికెటర్‌ ఇషాన్ కిషన్‌ తన దైన శైలిలో చెలరేగాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. సెంచరీతో కదం తొక్కాడు. అతని సూపర్‌ ఇన్నింగ్స్‌ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Ishan Kishan, Madhya Pradesh vs Jharkhand, Buchi Babu Tournament 2024: టీమిండియా యువ క్రికెటర్‌ ఇషాన్ కిషన్‌ తన దైన శైలిలో చెలరేగాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. సెంచరీతో కదం తొక్కాడు. అతని సూపర్‌ ఇన్నింగ్స్‌ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కొన్ని తప్పిదాలతో టీమిండియాకు దూరమైన యంగ్‌ టాలెంటెడ్‌ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌.. మళ్లీ టీమిండియాలో చోటే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. కమ్‌ బ్యాక్‌ ఇండియన్‌ రేంజ్‌లో.. తన కమ్‌ బ్యాక్‌ కోసం కసిగా ఆడుతున్నాడు. దేశవాళి క్రికెట్‌లో ప్రతిష్టాత్మక బుచ్చిబాబు టోర్నీలో జార్ఖండ్‌ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఇషాన్‌ కిషన్‌.. తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. మధ్యప్రదేశ్‌తో జరిగిన గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో చెలరేగాడు. అది కూడా.. విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు.

పైగా సెంచరీని తనదైన శైలిలో రెండు భారీ సిక్సర్లు కొట్టి మరీ అందుకోవడం విశేషం. 84 బంతుల్లో 92 పరుగుల వద్ద ఉన్న సమయంలో.. ఓ భారీ సిక్స్‌ కొట్టాడు ఇషాన్‌.. దాంతో అతని స్కోర్‌ 98 పరుగులకు చేరుకుంది. ఆ వెంటనే నెక్ట్స్‌ బాల్‌కే మరో సిక్స్‌తో సెంచరీ మార్క్‌ను చాలా గ్రాండ్‌గా అందుకున్నాడు. కేవలం 86 బంతుల్లోనే సెంచరీ సాధించి.. దేశవాళి క్రికెట్‌ తనదైన స్థాయి ప్రదర్శన కనబర్చాడు. ఈ ప్రదర్శన తర్వాత.. నెక్ట్స్‌ దులీప్‌ ట్రోఫీలోనూ రాణించి.. ఆ తర్వాత టీమిండియాలో చోటు కొట్టేయాలని ఇషాన్‌ టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఇషాన్‌.. టీమిండియాకు ఎందుకు దూరం అయ్యాడు, బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌ ఎందుక కోల్పోయాడో అందరికి తెలిసిందే. కెరీర్‌ ఆరంభంలోనే ఇషాన్‌కు అది పెద్ద ఎదురు దెబ్బ. దాని నుంచి బయటపడుతూ.. ఇషాన్‌ టీమిండియాలోకి తిరిగి కమ్‌ బ్యాక్‌ ఇవ్వాలనే కసితో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 107 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సులతో 114 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. కెప్టెన్‌గా జార్ఖండ్‌ టీమ్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. అలాగే బ్యాటర్‌గా కూడా తిరిగిలేని ఫామ్‌ను కనబర్చాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మధ్యప్రదేశ్‌ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకు ఆలౌట్‌ అయింది. శుభం కుష్వః 84, అర్హమ్ అక్విల్ 57 పరుగులతో రాణించారు. జార్ఖండ్‌ బౌలర్లలో శుభం సింగ్‌, సౌరభ్‌ శేఖర్‌ మూడేసి వికెట్లతో రాణించారు. అలాగే వివేకానంద్‌ తివారి, ఆదిత్య సింగ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన జార్ఖండ్‌ 84 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ 114 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వికాశ్‌ విశాల్‌ 38, షరన్‌దీప్‌ సింగ్‌ 33, ఆదిత్య సింగ్‌ 33 పరుగులు చేసి రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ అగ్రెసివ్‌గా ఆడి.. సెంచరీ సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments