Nidhan
Ishan Kishan Warning To Selectors: యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ టీమిండియాలోకి కమ్‌బ్యాక్ ఇవ్వాలని కసి మీద ఉన్నాడు. అందుకోసం తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని సత్తా చాటుతున్నాడు. అలాంటోడు తాజాగా సెలెక్టర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చాడు.
Ishan Kishan Warning To Selectors: యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ టీమిండియాలోకి కమ్‌బ్యాక్ ఇవ్వాలని కసి మీద ఉన్నాడు. అందుకోసం తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని సత్తా చాటుతున్నాడు. అలాంటోడు తాజాగా సెలెక్టర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చాడు.
Nidhan
దూకుడు మీద ఉన్న ప్లేయర్‌ను ఆపొచ్చు. తెలివిగా ఆడే వాళ్లనూ అడ్డుకోవచ్చు. కానీ కసి మీద ఉండే క్రికెటర్లను కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం టీమిండియా యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇలాగే ఫుల్ కసి మీద ఉన్నాడు. ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనే జోరు మీద ఉన్నాడీ లెఫ్టాండ్ బ్యాటర్. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తీసేయడంతో అవమాన భారంతో రగిలిపోతున్న ఇషాన్.. మళ్లీ మెన్ ఇన్ బ్లూలోకి అడుగుపెట్టి తానేంటో ప్రూవ్ చేయాలని అనుకుంటున్నాడు. అందుకోసం తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని సత్తా చాటుతున్నాడు. తొలుత బుచ్చిబాబు టోర్నమెంట్లో సెంచరీతో చెలరేగిన అతడు.. రీసెంట్గా దులీప్ ట్రోఫీలోనూ మూడంకెల స్కోరును అందుకొని ఔరా అనిపించాడు. కమ్‌బ్యాక్ ఇవ్వాలనే కసితో రెచ్చిపోయి ఆడుతున్న ఇషాన్.. తాజాగా సెలెక్టర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చాడు.
దులీప్ ట్రోఫీ-2024 సెకండ్ రౌండ్ మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఇషాన్. ఇందులో డిఫెన్స్ చేస్తున్న పిక్స్‌తో పాటు భారీ షాట్లు బాదుతుండటాన్ని కూడా చూడొచ్చు. ఈ పోస్ట్‌కు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టాడు. ‘అన్ఫినిష్డ్ బిజినెస్’ అనే క్యాప్షన్ పెట్టాడు. దీని గురించి ఇప్పుడంతా డిస్కస్ చేస్తున్నారు. ఇంతటితో ముగిసిపోలేదని.. ఇంకా బాదుడు బాకీ ఉందని ఈ పోస్ట్‌తో అతడు చెప్పకనే చెప్పాడని అంటున్నారు. వరుసగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడతానని.. ఎలా టీమిండియాలోకి తీసుకోరో చూస్తానంటూ సెలెక్టర్లకు ఇన్‌డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడని నెటిజన్స్ అంటున్నారు. ఫిట్నెస్ మెరుగడవడంతో పాటు తిరుగులేని ఫామ్‌లో ఉన్నందున బంగ్లాదేశ్‌తో జరిగే రెండో టెస్ట్ లేదా టీ20 సిరీస్‌కు ఇషాన్‌ను ఎంపిక చేయక తప్పదని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక, బుచ్చిబాబు టోర్నమెంట్లో జార్ఖండ్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్ కిషన్ సెంచరీతో మెరిశాడు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 బంతుల్లో 114 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్‌తో తన ఫామ్‌ను చాటుకున్నాడు. దీంతో అతడ్ని బంగ్లాతో టెస్ట్ సిరీస్‌కు సెలెక్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అదే టోర్నీలో గాయపడటంతో సెలెక్షన్‌కు పరిగణనలోకి తీసుకోలేదని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇంజ్యురీ నుంచి కోలుకొని దులీప్ ట్రోఫీలో ఇండియా-సీ తరఫున బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్.. 126 బంతుల్లో 111 పరుగుల థండర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే క్రమంలో రాబోయే మ్యాచుల్లోనూ భారీ సెంచరీలు బాది టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. అందుకే చేయాల్సింది చాలా ఉందంటూ తాజాగా నెట్టింట ఓ పోస్ట్ పెట్టాడు. జట్టులోకి తనను తీసుకోక తప్పదంటూ సెలెక్టర్లకు ఇన్‌డైరెక్ట్‌గా హెచ్చరికలు జారీ చేశాడు. మరి.. సెలెక్టర్లకు ఇషాన్ వార్నింగ్ ఇవ్వడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.