iDreamPost
android-app
ios-app

విరాట్‌ కోహ్లీ-రోహిత్‌ శర్మ ఖో-ఖో గేమ్‌ ఆడతారు: ఇషాన్‌ కిషన్‌

  • Published Nov 28, 2023 | 1:39 PM Updated Updated Nov 28, 2023 | 1:39 PM

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో యంగ్‌ టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి.. మూడో మ్యాచ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఇషాన్‌ కిషన్‌.. కోహ్లీ-రోహిత్‌ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడో అవేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో యంగ్‌ టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి.. మూడో మ్యాచ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఇషాన్‌ కిషన్‌.. కోహ్లీ-రోహిత్‌ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడో అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 28, 2023 | 1:39 PMUpdated Nov 28, 2023 | 1:39 PM
విరాట్‌ కోహ్లీ-రోహిత్‌ శర్మ ఖో-ఖో గేమ్‌ ఆడతారు: ఇషాన్‌ కిషన్‌

టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గురించి యంగ్‌ సెన్సెషన్‌ ఇషాన్‌ కిషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ-రోహిత్‌ శర్మ ఖో-ఖో ప్లేయర్లను పేర్కొన్నాడు. దీంతో ఇషాన్‌ చేసిన ఈ కామెంట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో టీమిండియా.. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ ఓటమి బాధ నుంచి ఇంకా చాలా మంది క్రికెట్‌ అభిమానులు, ఆటగాళ్లు కోలుకోలేదు. వరల్డ్‌ కప్‌ ఆడిన చాలా మంది ప్లేయర్లకు రెస్ట్‌ ఇచ్చిన సెలెక్టర్లు.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌కు యువకుల కూడిన జట్టును ఎంపిక చేశారు.

ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలోని యంగ్‌ టీమిండియా సూపర్‌ ఫామ్‌లో దూసుకెళ్తోంది. వరల్డ్‌ కప్‌ గెలిచిన సంతోషంలో ఉన్న ఆస్ట్రేలియాకు షాకిస్తూ.. తొలి రెండు మ్యాచ్‌ల్లో వాళ్లను చిత్తుగా ఓడించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఇషాన్‌ కిషన్‌ అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలో మూడో టీ20కి ముందు ఇక ఫన్నీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇషాన్‌ కిషన్‌.. అడిగిన అన్ని ప్రశ్నలకు తప్పు సమాధానం చెప్పాల్సిన టాస్క్‌లో సక్సెస్‌ అయ్యాడు. తనను అడిగిన అన్ని ప్రశ్నలకు సరైనా జవాబులు కాకుండా.. తప్పుడు సమాధానాలు ఇవ్వడమే ఆ గేమ్‌. అందులో ఎదురైనా ఒక ప్రశ్న ఏంటంటే.. కోహ్లీ-రోహిత్‌ ఏ ఆట ఆడతారని అడగ్గా.. తప్పు సమాధానం చెప్పాలి కాబట్టి.. ఖో-ఖో అని బదులిచ్చాడు ఇషాన్‌.

అయితే.. రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లీ తాజాగా ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అద్భుతంగా రాణించారు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ నంబర్‌ స్థానంలో నిలవగా.. రోహిత్‌ శర్మ సైతం టాప్‌ 3లో నిలిచాడు. కోహ్లీ మొత్తం 765 పరుగులు చేసి కొత్త చరిత్ర లిఖించాడు. ఇప్పటి వరకు ఏ వరల్డ్‌ కప్‌లో కూడా ఒక ఆటగాడు ఇన్ని పరుగులు చేయలేదు. 2003 వన్డే వరల్డ్‌ కప్‌ సందర్భంగా సచిన్‌ టెండూల్కర్‌ చేసిన 673 పరుగుల రికార్డును కోహ్లీ అధిగమించాడు. ఇక ఒక వరల్డ్‌ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు రోహిత్‌ పేరిటే ఉంది. 2019లో రోహిత్‌ శర్మ ఏకంగా 5 సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. మరి ఈ ఇద్దరు లెజెండరీ ప్లేయర్ల గురించి ఇషాన్‌ కిషన్‌ సరదాగా చేసిన వ్యాఖ్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.