వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 255 రన్స్‌కు ఆలౌట్ చేసి 183 రన్స్ లీడ్‌ను సంపాదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ధనాధన్ ఆటతో 181/2 దగ్గర డిక్లేర్ చేసి విండీస్‌కు 365 రన్స్ టార్గెట్‌ను నిర్దేశించింది. భారీ రన్ ఛేజింగ్‌లో కరీబియన్ టీమ్ నాలుగో రోజు ఆట ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 76 రన్స్ చేసింది. వెస్టిండీస్ విజయానికి ఇంకా 289 రన్స్ అవసరం. యంగ్ బ్యాటర్ త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (16 నాటౌట్)తో పాటు బ్లాక్‌వుడ్ (20 నాటౌట్) క్రీజులో ఉన్నారు. నిలకడగా ఆడుతూ వచ్చిన క్రెయిగ్ బ్రాత్‌వైట్ (28), కిర్క్ మెకంజీ (0)ను రవిచంద్రన్ అశ్విన్ వరుస ఓవర్లలో ఔట్ చేశాడు. మూడో రోజు టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న వెస్టిండీస్ బ్యాటర్లు.. నాలుగో రోజు ఫస్ట్ సెషన్లోనే తేలిపోయారు.
ఓవర్‌నైట్ స్కోరు 229/5తో బ్యాటింగ్‌ను కొనసాగించిన విండీస్.. 7.4 ఓవర్లలో 26 రన్స్ చేసి ఆఖరి ఐదు వికెట్లు కోల్పోయింది. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (5/60) ప్రత్యర్థిని చావుదెబ్బ తీశాడు. ఆతిథ్య జట్టు ఆఖరి నాలుగు వికెట్లు అతడి ఖాతాలోనే చేరాయి. గేమ్ మొదలు కాగానే విండీస్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అథనేజ్ (37) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత జేసన్ హోల్డర్ (15)తో పాటు జోసెఫ్‌ను వెనక్కి పంపాడు సిరాజ్. అలాగే కీమర్‌రోచ్, గాబ్రియెల్‌ను ఒకే ఓవర్లో ఔట్ చేసి భారత శిబిరంలో జోష్ నింపాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టింది. రోహిత్ శర్మ (44 బంతుల్లో 57) టీ20 తరహాలో ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.
తొలి టెస్టుతో పాటు రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనూ ఫెయిలై విమర్శలు ఎదుర్కొంటున్న ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటాడు. బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడి 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇది అతడికి టెస్టుల్లో తొలి అర్ధ సెంచరీ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్ క్రెడిట్‌ను రిషబ్ పంత్‌కు ఇస్తానన్నాడు ఇషాన్. ఎన్సీఏలో తాను ప్రాక్టీస్ చేసినప్పుడు అక్కడే ఉన్న పంత్ తనకు విలువైన సూచనలు చేశాడన్నాడు. బ్యాట్ పట్టుకునే పొజిషన్ మార్చుకోవడంలో పంత్ సాయపడ్డాడని అతడికి థ్యాంక్స్ చెప్పాల్సిందేనన్నాడు ఇషాన్. ఇక, ఈ మ్యాచ్‌లో ‘ఆర్పీ 17’ అని రాసి ఉన్న బ్యాట్‌తో గ్రౌండ్లోకి దిగిన ఇషాన్.. పంత్ స్టైల్లో సింగిల్ హ్యాండ్‌తో సిక్స్ కొట్టడం విశేషం.
That’s a smashing way to bring your maiden Test 50*@ishankishan51
.
.#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/WIFaqpoGiD
— FanCode (@FanCode) July 23, 2023
Hey Rishabh Pant – Ishan Kishan thanks you 😊#TeamIndia | #WIvIND | @RishabhPant17 | @ishankishan51 | @windiescricket pic.twitter.com/hH6WxxJskz
— BCCI (@BCCI) July 24, 2023