SNP
టీ20, వన్డేల్లో తనని తాను నిరూపించుకున్న ఇషాన్ కిషన్.. ఒక్క చిన్న తప్పుతో.. బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. అయితే.. బీసీసీఐ ఇషాన్‌కు బీసీసీఐ మరో అవకాశం ఇస్తోంది. కానీ, ఒక్క గట్టి కండీషన్ పెట్టింది. ఆ ఛాన్స్ ఏంటి? ఆ కండీషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టీ20, వన్డేల్లో తనని తాను నిరూపించుకున్న ఇషాన్ కిషన్.. ఒక్క చిన్న తప్పుతో.. బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. అయితే.. బీసీసీఐ ఇషాన్‌కు బీసీసీఐ మరో అవకాశం ఇస్తోంది. కానీ, ఒక్క గట్టి కండీషన్ పెట్టింది. ఆ ఛాన్స్ ఏంటి? ఆ కండీషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్.. టాలెంట్‌కు ఏ మాత్రం కొదవలేని ఆటగాడు. ఇన్‌ఫ్యాక్ట్.. భారత జట్టు భవిష్యత్తు స్టార్‌గా కూడా ఇషాన్‌కు పేరొచ్చింది. అందుకే తగ్గట్లే.. తనకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. టీమ్‌లో తన ప్లేస్‌ను పర్మినెంట్ చేసుకోనే పనిలో బీజీగా ఉన్నాడు ఈ యువ క్రికెటర్. కాకపోతే.. గత రెండు మూడు రోజులగా ఇషాన్ కిషన్ పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మూడు టీ20 సిరీస్‌కు ఇషాన్‌ను కావాలనే పక్కనపెట్టారని సంచలన విషయం బయటికి వచ్చింది. ఈ వార్తతో క్రికెట్ అభిమానులు షాక్ అయ్యాడు. టీ20ల్లో అద్భుతంగా ఆడుతున్న ఇషాన్‌ను కావాలనే ఎందుకు పక్కనపెట్టారని తెగ కంగారు పడ్డారు.
అయితే.. మానసిక ఒత్తడి కారణంగా రెస్ట్ కావాలని కోరిన ఇషాన్ కిషన్.. దుబాయ్‌కి వెళ్లి ఒక పార్టీలో పాల్గొన్నాడని, అలాగే హిందీలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా చేసే కౌన్ బనేగా కరోడ్ పతి షోకు కూడా బీసీసీఐ అనుమతి లేకుండా ఇషాన్ కిషన్ పాల్గొన్నాడని అందుకే క్రికెట్ బోర్డు సీరియస్ అయి.. ఆఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌కు ఇసాన్ కిషన్‌ను పక్కనపెట్టినట్లు వార్తలొచ్చాయి. అయితే.. అందంతా ఏం లేదని, కిషన్ విశ్రాంతి కోరాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చినా.. క్రికెట్ వర్గాల్లో మాత్రం బీసీసీఐ ఇషాన్‌పై చర్యలు తీసుకుందని నమ్ముతున్నారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో ఇషాన్ కిషన్ సైతం ఖంగుతిన్నాడు. కాగా, టెస్ట్ టీమ్ కాంబినేషన్ కోసం మరోసారి ఇషాన్‌కు ఒక అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఆఫ్ఘాన్‌తో టీ20 సిరీస్ తర్వాత.. ఇండియా-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్‌ను కేవలం బ్యాటింగ్‌కే పరిమితం చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. టీమిండియా రాహుల్ ఎంతో కీలకమైన ఆటగాడు, అన్ని ఫార్మాట్లలోనూ అతను టీమ్‌కు అవసరం. అలాంటి ఆటగాడు టెస్టుల్లో వికెట్ కీపింగ్ చేస్తే అలసిపోయి, గాయాలపాలయ్యే ప్రమాదం ఉందని గ్రహించిన టీమ్ మేనేజ్‌మెంట్.. టెస్టుల్లో మరో వికెట్ కీపర్ కోసం చూస్తోంది. మన తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌కు కొన్ని అవకాశాలు ఇచ్చినా.. అతను ఆశించిన స్థాయిలో రాణించలేపోయాడు. దీంతో ఇషాన్ కిషన్‌ను ట్రై చేయాలని బోర్డు భావిస్తోందట. అయితే.. ఇప్పటికే తప్పు చేసి బీసీసీఐ ఆగ్రహానికి గురైన ఇషాన్‌కు కిషన్‌కు ఒక కండీష్ పెట్టినట్లు సమాచారం. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభం అయ్యే వరకు దేశవాళీ టోర్నీ రంజీల్లో ఆడి సత్తా చాటాలని సూచించినట్లు తెలుస్తోంది. రంజీల్లో మంచి ప్రదర్శన కనబర్చితే.. ఇషాన్‌ను ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేస్తారన్నమాట. మరి చిన్న తప్పుతో టీ20 జట్టుకు దూరమైన ఇషాన్.. మరీ టెస్టుల్లో చోటు కోసం మళ్లీ రంజీ నుంచి మొదలుపెట్టాల్సి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ishan Kishan instructed to play Ranji trophy for comeback in Test Cricket as BCCI don’t want KL Rahul as wicketkeeper in Test.#IshanKishan #BCCI #CricketNews #CricketLovers #SportsNews #SportsLovers #CRICInformer #KLRahul pic.twitter.com/HfJp0xyTll
— CricInformer (@CricInformer) January 11, 2024