Nidhan
భారత క్రికెట్‌కు ఎంతో సేవలు అందించారా ఇద్దరు ఆటగాళ్లు. ఎన్నో మ్యాచుల్లో కష్టాల్లో ఉన్న జట్టును ఒంటిచేత్తో ఒడ్డున పడేశారు. అలాంటి వాళ్లను బీసీసీఐ అవమానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భారత క్రికెట్‌కు ఎంతో సేవలు అందించారా ఇద్దరు ఆటగాళ్లు. ఎన్నో మ్యాచుల్లో కష్టాల్లో ఉన్న జట్టును ఒంటిచేత్తో ఒడ్డున పడేశారు. అలాంటి వాళ్లను బీసీసీఐ అవమానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Nidhan
భారత క్రికెట్‌కు ఎంతో సేవలు అందించారా ఇద్దరు ఆటగాళ్లు. ఎన్నో మ్యాచుల్లో కష్టాల్లో ఉన్న జట్టును ఒంటిచేత్తో ఒడ్డున పడేశారు. అందులో ఒకరు అజింక్యా రహానె అయితే మరొకరు ఛటేశ్వర్ పుజారా. అన్ని ఫార్మాట్లలోనూ ఆడిన రహానె.. టెస్టుల్లో జట్టుకు కొన్ని మ్యాచుల్లో కెప్టెన్‌గానూ ఉన్నాడు. చారిత్రాత్మక గబ్బా టెస్ట్ విజయంలో ఆటగాడిగా, సారథిగా అతడి పాత్ర ఎంతో ఉంది. అటు పుజారా గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ద్రవిడ్ వారసుడిగా, నయా వాల్‌గా పేరు తెచ్చుకున్న పుజారా.. టెస్టుల్లో ఈతరం చూసిన గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. క్రీజులో సెటిలైతే అతడ్ని ఔట్ చేయడం ఏ టీమ్ వల్ల కాదు. అలాంటి ఈ ఇద్దరు దిగ్గజాలు జాతీయ జట్టుకు దూరమై చాలా కాలం కావొస్తోంది.
టీమిండియాలోకి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రహానె-పుజారా ఎంతో ప్రయత్నించారు. ముఖ్యంగా పుజారా అయితే డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు. అయినా అతడ్ని సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. తాజాగా వీళ్లను బీసీసీఐ అవమానించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు టీమిండియాకు మ్యాచ్‌లు లేకపోవడంతో ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే బంగ్లాదేశ్‌తో వచ్చే నెలలో టెస్ట్ సిరీస్ ఉంది. దీంతో సెప్టెంబర్ 5 నుంచి మొదయల్యే దులీప్ ట్రోఫీలో ఆడాల్సిందిగా గిల్, అక్షర్, జడేజా, జైస్వాల్, సూర్యకుమార్, కుల్దీప్ను బీసీసీఐ ఆదేశించింది. వీళ్లతో పాటు బోర్డు కాంట్రాక్ట్ కోల్పోయి, టీమ్‌కు దూరమైన ఇషాన్ కిషన్‌ను కూడా టోర్నీలో ఆడమని స్పష్టం చేసింది. అయితే ఇషాన్‌కు ఇచ్చినంత విలువ పుజారా, రహానేకు ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బీసీసీఐ మాట పెడచెవిన పెట్టి డొమెస్టిక్ క్రికెట్లో ఆడకుండా కాంట్రాక్ట్ కోల్పోయాడు ఇషాన్. అలాంటోడి రీఎంట్రీ కోసం గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన బోర్డు పెద్దలు.. భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన పుజారా, రహానేకు మాత్రం మొండిచెయ్యి చూపారని తెలిసింది. వీళ్లను కనీసం సెలెక్షన్ పరిధిలోకి తీసుకోకపోవడం, దులీప్ ట్రోఫీలో ఆడమని ఇండికేషన్స్ పంపలేదట బీసీసీఐ. దీంతో ఒకవేళ ఆ టోర్నమెంట్లో రాణించినా పుజారా, రహానె కమ్‌బ్యాక్ ఇవ్వలేరని.. వాళ్ల కెరీర్ క్లోజ్ అయినట్లేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకో మూడ్నాలుగేళ్లు లాంగ్ ఫార్మాట్ ఆడే సత్తా ఉన్న దిగ్గజాలను బోర్డు ఇలా అవమానించడం కరెక్ట్ కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే బాగుంటుందని, అంత తప్పేం చేశారని సోషల్ మీడియాలో నెటిజన్స్ నిలదీస్తున్నారు. మరి.. పుజారా-రహానేను బోర్డు పట్టించుకోకపోవడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.