iDreamPost
android-app
ios-app

విండీస్ తో మ్యాచ్.. అరుదైన ఘనత సాధించిన ఇషాన్ కిషన్!

  • Author Soma Sekhar Published - 08:30 AM, Wed - 2 August 23
  • Author Soma Sekhar Published - 08:30 AM, Wed - 2 August 23
విండీస్ తో మ్యాచ్.. అరుదైన ఘనత సాధించిన ఇషాన్ కిషన్!

ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా దుమ్మురేపుతోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్.. తాజాగా వన్డే సిరీస్ ను గెలుచుకుని సత్తాచాటింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో 200 పరుగుల భారీ తేడాతో విండీస్ పై విజయం సాధించింది టీమిండియా. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో.. భారత్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో అరుదైన ఘనత నమోదు చేశాడు టీమిండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్. దీంతో మిస్టర్ కూల్, టీమిండియా మాజీ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని సరసన చేరాడు ఇషాన్ కిషన్.

ఇషాన్ కిషన్.. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వెస్టిండీస్ తో జరిగిన మూడు వన్డేల్లో వరుసగా మూడు అర్దశతకాలు నమోదు చేశాడు. దీంతో రేర్ ఫీట్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు ఈ యంగ్ ఓపెనర్. ద్వైపాక్షిక సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ ల్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించిన 6వ భారత బ్యాటర్ గా ఘనతకెక్కాడు. మూడు వన్డేల్లో వరుసగా.. 52, 55, 77 పరుగులు సాధించాడు. దీంతో దిగ్గజాల సరసన నిలిచాడు ఇషాన్ కిషన్. దిలీప్ వెంగ్ సర్కార్, మహ్మద్ అజారుద్దీన్, కృష్ణమాచారి, ధోని, శ్రేయర్ అయ్యార్ సరసన నిలిచాడు ఇషాన్ కిషన్.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. జట్టులో ఇషాన్ కిషన్ (77), గిల్ (85), శాంసన్ (51), పాండ్యా (70) పరుగులతో రాణించారు. అనంతరం 352 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 151 పరుగులకే కుప్పకూలింది. జట్టులో టెయిలెండర్ అయిన గుడకేశ్ మోతీ (39) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ 4 వికెట్లతో రాణించగా.. ముకేశ్ కుమార్ 3 వికెట్లతో సత్తాచాటాడు.


ఇదికూడా చదవండి: ఉస్మాన్ ఖవాజా అరుదైన రికార్డు.. యాషెస్ హిస్టరీలో 26 ఏళ్ల తర్వాత..!