ప్రపంచ టెస్టు సిరీస్ ఫైనల్ తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే టీమిండియా ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు కరీబియన్ గడ్డపై అడుగుపెట్టింది భారత్. తాజాగా ముగిసిన తొలి టెస్టులో సూపర్బ్ విక్టరీతో ఈ టూర్‌ను గ్రాండ్‌గా ఆరంభించింది రోహిత్ సేన. విండీస్‌తో డొమినికా వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఈ విక్టరీతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (2023-25) సైకిల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం లభించిందని చెప్పొచ్చు. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్‌లోనూ మన ప్లేయర్లు అదరగొట్టారు. విండీస్‌పై మొదటి టెస్టులో సెంచరీతో కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌ను అందుకోవడం విశేషం.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తృటిలో శతకాన్ని మిస్సయినా తన క్లాస్‌ను నిరూపించుకున్నాడు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అయితే డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్, జైస్వాల్, కోహ్లి బ్యాటింగ్‌లో రాణించగా.. బౌలింగ్ భారాన్ని తన భుజస్కందాలపై మోశాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. మ్యాచ్‌లో ఏకంగా 12 వికెట్లు తీసి విండీస్‌ను దారుణంగా దెబ్బతీశాడు. అశ్విన్‌కు మిగతా బౌలర్లు బాగా సహకరించారు. ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో తొలి టెస్టును మూడ్రోజుల్లోనే ముగించింది టీమిండియా. యంగ్‌స్టర్ జైస్వాల్ సెంచరీ మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచింది. అయితే మరో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. విండీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన ఈ లెఫ్టాండర్.. ఒక్క రన్ చేసేందుకు 20 బంతులు తీసుకున్నాడు.
బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ ఫెయిలైన ఇషాన్ కిషన్.. విరాట్ కోహ్లి, అజింక్యా రహానె లాంటి సీనియర్లను టీజ్ చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవతున్నాడు. మొదటిరోజు ఆటలో కోహ్లీకి ఇషాన్ కిషన్ సూచనలు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ సందర్భంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీని కాస్త పక్కకు జరగమని ఇషాన్ సూచించాడు. మూడో రోజు ఆట సందర్భంగా భారత్ విజయానికి చేరువవుతున్న తరుణంలో వైస్ కెప్టెన్ అజింక్యా రహానేను అవమానించినట్లుగా మాట్లాడాడు ఇషాన్. విండీస్ ఆఖరి బ్యాటర్ జోమెల్ వారికన్ 18 బంతుల్లో 18 రన్స్ చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
వారికన్ ఇన్నింగ్స్‌ను రహానె గేమ్‌తో పోల్చాడు ఇషాన్. ఇతడు నీ కంటే ఎక్కువ బంతులు ఆడాడు అజ్జూ భయ్యా అంటూ రహానేను టీజ్ చేశాడు. దీంతో సీరియస్ లుక్ ఇచ్చిన రహానె.. ‘ఏంటి? ఏమంటున్నావ్’ అని బదులిచ్చాడు. కోహ్లీతో పాట రహానేను కించపరిచిన ఇషాన్ కిషన్‌పై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ‘ఇషాన్.. అంతొద్దు, కాస్త తగ్గు. ఇలాంటి పిచ్చిపనులు మానేసి గేమ్‌పై ఫోకస్ చెయ్’ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆట తక్కువ, ఓవరాక్షన్ ఎక్కువ.. సీనియర్లతో ఇలాగేనా ప్రవర్తించేది అని నెటిజన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. ఇషాన్ కిషన్ ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Nihari Korma (@NihariVsKorma) July 15, 2023