Nidhan
టీమిండియా యంగ్ బ్యాటర్స్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌పై భారత క్రికెట్ బోర్డు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. వీళ్ల మీద చర్యలు తీసుకోవడం ఖాయం అంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అవి ఇప్పుడు నిజమయ్యాయి.
టీమిండియా యంగ్ బ్యాటర్స్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌పై భారత క్రికెట్ బోర్డు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. వీళ్ల మీద చర్యలు తీసుకోవడం ఖాయం అంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అవి ఇప్పుడు నిజమయ్యాయి.
Nidhan
టీమిండియా స్టార్ బ్యాటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ ఇద్దరి సెంట్రల్ కాంట్రాక్ట్‌లను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) రద్దు చేసింది. రంజీల్లో ఆడమని సూచించినా వినకపోవడం, తమ మాటల్ని పట్టించుకోకపోవడంతో ఇషాన్, అయ్యర్‌పై బీసీసీఐ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరి కాంట్రాక్టులను రద్దు చేయాలనే ఆలోచనల్లో బోర్డు ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే నిజమైంది. 2023-24 ఏడాదికి గానూ టీమిండియా క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్టుల రిటెయినర్షిప్పై తాజాగా కీలక ప్రకటన చేసింది బీసీసీఐ. ఇందులో భారత్‌కు ఆడుతున్న రెగ్యులర్ ప్లేయర్ల అందరి పేర్లు ఉన్నాయి. కానీ అయ్యర్, ఇషాన్ మాత్రం ఆ జాబితాలో లేరు.
బీసీసీఐ ప్రకటించిన యానువల్ ప్లేయర్ రిటెయినర్షిప్ జాబితాలో కొత్త పేసర్ ఆకాశ్ దీప్ ఉన్నాడు. అతడితో పాటు విజయ్ కుమార్ వైషాక్, యష్ దయాల్, విద్వత్ కవేరప్ప లాంటి అన్క్యాప్డ్ ప్లేయర్లు కూడా ఉన్నారు. కానీ అయ్యర్, ఇషాన్‌ల పేర్లు మాత్రం లేవు. బోర్డు కాంట్రాక్టులను పునరుద్ధరించకపోవడంతో వాళ్లిద్దరూ ఇక మీదట భారత జట్టుకు దూరంగా ఉంటారు. బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి ఇషాన్, అయ్యర్ ఔట్ అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. బోర్డుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. అయ్యర్, ఇషాన్ కాంట్రాక్ట్‌లను బీసీసీఐ రద్దు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ishan Kishan and Shreyas Iyer have been excluded from the BCCI Central Contract. pic.twitter.com/Q8UW1p0LBg
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 28, 2024