Nidhan
ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ వేటు వేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఓ మాజీ క్రికెటర్ రియాక్ట్ అయ్యాడు. వాళ్లిద్దర్నీ తీసేయడమే కరెక్ట్ అన్నాడు.
ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ వేటు వేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఓ మాజీ క్రికెటర్ రియాక్ట్ అయ్యాడు. వాళ్లిద్దర్నీ తీసేయడమే కరెక్ట్ అన్నాడు.
Nidhan
టీమిండియా ఫ్యూచర్ స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్. అయ్యర్ నిలకడగా పరుగులు చేస్తూ ప్రామిసింగ్ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇషాన్ లెఫ్టాండ్ బ్యాటింగ్‌తో అదరగొడుతూనే టాలెంటెడ్ కీపర్‌గానూ అందరి దృష్టిని ఆకర్షించాడు. వీళ్లిద్దరూ టీమ్‌లో చాలా ఏళ్లు కొనసాగుతారని అనుకుంటున్న వేళ స్వీయ తప్పిదాలతో భారత క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయారు. డొమెస్టిక్ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ ఆదేశించినా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. బోర్డు వేటు వేయడంతో వీరి కెరీర్ ప్రమాదంలో పడింది. ఇప్పట్లో టీమిండియాలోకి వీళ్లు కమ్‌బ్యాక్ ఇవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ విషయంపై భారత మాజీ కోచ్, 1983 వరల్డ్ కప్ హీరో మదన్ లాల్ రియాక్ట్ అయ్యాడు. బీసీసీఐ చేసిన దాంట్లో తప్పేమీ లేదన్నాడు. వాళ్లిద్దర్నీ తీసేయడమే కరెక్ట్ అన్నాడు.
ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ల కాంట్రాక్ట్‌లను బోర్డు తొలగించడమే కరెక్ట్ అన్నాడు మదన్‌లాల్. గేమ్ కంటే ఎవరూ ఎక్కువ కాదని స్పష్టం చేశాడు. ‘ఇషాన్, అయ్యర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాల్సిందేనని బోర్డు ఆదేశిస్తే వాళ్లు తప్పక ఆడాలి. ఆట కంటే ఎవరూ ఎక్కువ కాదు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో టీమిండియా ఆటగాళ్లు ఆడాల్సిందేనంటూ బోర్డు రూల్ తీసుకురావడం గొప్ప విషయం. ఇందుకు బీసీసీఐని మెచ్చుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది ప్లేయర్లు డొమెస్టిక్ క్రికెట్‌ను లైట్ తీసుకుంటున్నారు. ఐపీఎల్ వల్ల ఈ దుస్థితి నెలకొంది. బీసీసీఐ పెట్టిన నిబంధనలను ఆటగాళ్లు తప్పకుండా ఫాలో అవ్వాలి. ఒకవేళ రూల్స్‌ను ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకొని అందరికీ హెచ్చరికలు పంపాలి’ అని మదన్ లాల్ చెప్పుకొచ్చాడు. వాళ్లకో రూల్.. వీళ్లకో రూల్ అంటూ ఉండదని.. బోర్డు ఓ నిబంధన పెట్టిందంటే దానికి అందరూ కట్టుబడాల్సిందేనని స్పష్టం చేశాడు.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయినా భారత జట్టులోకి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వొచ్చని అన్నాడు మదన్‌లాల్. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రాణించడం ద్వారా ఫామ్, ఫిట్నెస్ను నిరూపించుకోవాలని వాళ్లిద్దరికీ సూచించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో పెర్ఫార్మెన్స్తో అదరగొట్టడం ద్వారా కూడా కమ్‌బ్యాక్ ఇవ్వొచ్చన్నాడు. ఇషాన్, అయ్యర్ భారత జట్టుకు ఎంతో సేవలు అందించారని.. తమకు వచ్చిన ఛాన్సుల్ని యూజ్ చేసుకొని బాగా పెర్ఫార్మ్ చేశారని మెచ్చుకున్నాడు. అయితే టీమ్ బాగు కోసం పెట్టే రూల్స్‌ను ఎవరు అతిక్రమించినా బీసీసీఐ ఊరుకోదని.. క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదన్నాడు మదన్‌లాల్. ఫెంటాస్టిక్ రిజల్ట్స్ రావాలంటే డిసిప్లిన్ కూడా అదే లెవల్లో ఉంటేనే సాధ్యమన్నాడీ వరల్డ్ కప్ హీరో. మరి.. అయ్యర్, ఇషాన్‌ను తీసేయడమే కరెక్ట్ అంటూ మదన్‌లాల్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: పాకిస్థాన్ సూపర్ లీగ్ అంతా ఫిక్సింగేనా? ఇదే సాక్ష్యం!
Former Indian coach Madan Lal believes Shreyas Iyer and Ishan Kishan should have played the Ranji Trophy games.#BCCI #ShreyasIyer #IshanKishan #TeamIndia #MadanLal #CricketTwitter pic.twitter.com/6AmcUuA9IP
— InsideSport (@InsideSportIND) March 1, 2024