సఫారీ సిరీస్ కు భారత సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్లపై మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పేస్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్ లపై అతడిని ఎంపిక చేయకపోడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పుకొచ్చాడు.
సఫారీ సిరీస్ కు భారత సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్లపై మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పేస్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్ లపై అతడిని ఎంపిక చేయకపోడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పుకొచ్చాడు.
ఇండియా-సౌతాఫ్రికా మధ్య సుదీర్ఘ సిరీస్ జరగనుంది. అందులో భాగంగా 3 వన్డేలు, 3 టీ20లు, రెండు టెస్టు మ్యాచ్ లు ఆడన్నాయి. ఇక ఈ సిరీస్ కు సంబంధించి బీసీసీఐ మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. టీ20లకు సూర్యకుమార్, వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్టులకు రోహిత్ శర్మలు సారథ్యం వహించనున్నారు. యువకులకు ఈ సిరీస్ లో ప్రాధాన్యత ఇచ్చింది. అయితే కొంతమందికి అన్యాయం జరిగిందని సెలెక్టర్ల ఎంపికపై మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సఫారీ సిరీస్ కు భారత సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్లపై మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పేస్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్ లపై అతడిని ఎంపిక చేయకపోడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
సౌతాఫ్రికాతో జరగబోయే సిరీస్ కు ఎవరెవరిని ఎంపిక చేస్తారా? అని క్రికెట్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించి మూడు ఫార్మాట్లో ఆడే జట్లను బీసీసీఐ ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ 2024ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే పేస్ బౌలింగ్ కు అనుకూలించే సౌతాఫ్రికా పిచ్ లపై ఆడేందుకు భారత సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్లపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా కశ్మీర్ స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్ ను జట్టులోకి తీసుకోకపోవడాన్ని తప్పు పట్టాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
“టీమిండియాలో 11 నెలల క్రితం ఉన్న ఆటగాడికి ఈ సిరీస్ కు జట్టులో స్థానం దక్కుతుందని నేను పూర్తిగా నమ్మాను. కానీ నా అంచనాలు తప్పు అయ్యాయి” అంటూ హ్యాష్ ట్యాగ్ ఉమ్రాన్ మాలిక్ అని జోడించాడు. కాగా.. ఉమ్రాన్ గంటకు 150 కి.మీ వేగంతో బంతులు సంధిస్తాడన్న మంచి పేరుంది. అయితే ధారాళంగా పరుగులు ఇస్తాడనే అపవాదు కూడా మరోవైపు ఉంది. కానీ పేస్ కు అనుకూలించే పిచ్ లపై ఉమ్రాన్ ను తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఇర్ఫాన్ పఠాన్. మరి పఠాన్ చెప్పినట్లుగా ఉమ్రాన్ ను ఎంపిక చేయకపోవడం తప్పేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
I’m pretty sure the guy who was in the Indian team’s playing 11 few months back can surely find a place in India A side. #umranmalik
— Irfan Pathan (@IrfanPathan) November 30, 2023