iDreamPost
android-app
ios-app

ఇషాన్‌, అయ్యర్‌కే రూల్స్‌ వర్తిస్తాయా? పాండ్యాకు వర్తించవా?: భారత్‌ క్రికెటర్‌

  • Published Feb 29, 2024 | 2:25 PM Updated Updated Feb 29, 2024 | 2:25 PM

Irfan Pathan, Hardik Pandya: ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తొలగించడంపై ఓ భారత మాజీ క్రికెటర్‌ స్పందిస్తూ.. హార్ధిక్‌ పాండ్యాకు రూల్స్‌ వర్తించవా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Irfan Pathan, Hardik Pandya: ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తొలగించడంపై ఓ భారత మాజీ క్రికెటర్‌ స్పందిస్తూ.. హార్ధిక్‌ పాండ్యాకు రూల్స్‌ వర్తించవా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 29, 2024 | 2:25 PMUpdated Feb 29, 2024 | 2:25 PM
ఇషాన్‌, అయ్యర్‌కే రూల్స్‌ వర్తిస్తాయా? పాండ్యాకు వర్తించవా?: భారత్‌ క్రికెటర్‌

ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌ వర్గాల్లో ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌కు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ దక్కకపోవడంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. దేశవాళి క్రికెట్‌ ఆడలేదనే కారణంతోనే బీసీసీఐ వారిద్దరిపై వేటు వేసిందని సమాచారం. చాలా రోజులుగా వీరిద్దరిపై వేటు పడుతుందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ.. తాజాగా విడుదల చేసిన సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ నుంచి అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ను తొలగించింది బీసీసీఐ. గతంలో శ్రేయస్‌ అయ్యర్‌ బీ గ్రేడ్‌లో, ఇషాన్‌ కిషన్‌ సీ గ్రేడ్‌లో ఉండేవారు. ఈ సారి చాలా మంది యువ క్రికెటర్లను సెంట్రల్‌ కాంట్రక్ట్‌లోకి తీసుకున్న బీసీసీఐ.. అలాగే పుజారా, రహానే, ధావన్‌ లాంటి సీనియర్లతో పాటు మరికొంతమందిని కాంట్రాక్ట్‌ నుంచి తప్పించింది. తొలగింపు లిస్ట్‌లో ఇషాన్‌, అయ్యర్‌ ఉండటం షాకింగ్‌గా మారింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

రూల్స్‌ అనేవి.. కేవలం ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌కే వర్తిస్తాయా? అంటూ బీసీసీఐ నిర్ణయాన్ని ప్రశ్నించేలా స్పందించాడు. అయ్యర్‌, ఇషాన్‌ స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్‌ ఇస్తారని ఆశిస్తున్నాను.. దేశవాళి క్రికెట్‌లో ఆడలేదని వారిపై వేటు వేశారు.. అలాగే రూల్స్‌ కేవలం వారికే వర్తిస్తాయా? హార్ధిక్‌ పాండ్యా లాంటి ఆటగాళ్లు టెస్టులకు దూరంగా ఉంటూ టీమిండియా తరఫున కేవలం వైట్‌ బాల్‌ క్రికెట్‌ మాత్రమే ఆడుతున్నారు. అలాంటి ప్లేయర్లు ఇండియా తరఫున వైట్‌బాల్‌ క్రికెట్‌ ఆడని సయమంలో.. దేశవాళి క్రికెట్‌లో వైట్‌ బాల్‌ క్రికెట్‌ ఆడాలనే రూల్‌ ఉందా? అలా లేకపోతే ఇండియన్‌ క్రికెట్‌ ఎలా బాగు పడుతుంది అంటూ ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు.

అయితే.. పఠాన్‌ చేసిన వ్యాఖ్యలకు క్రికెట్‌ అభిమానుల నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. నిజం మాట్లాడారు అంటూ పఠాన్‌ చేసిన కామెంట్‌ను చాలా మంది సమర్ధిస్తున్నారు. హార్ధిక్‌ పాండ్యా తన రాజకీయ పరిచయాలతో తప్పించుకుంటున్నాడని, బీసీసీఐ పక్షపాత ధోరణి అవలంభిస్తోంది, పాండ్యా విషయంలో ఫేవరేటిజం చూపిస్తో​ందంటూ కొంతమంది నెటిజన్లు కూడా పాండ్యాకు వ్యతిరేకంగా కామెంట్‌ చేస్తున్నారు. ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ లానే దేశవాళి క్రికెట్‌ ఆడని పాండ్యాపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.