Somesekhar
సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఓ టీమిండియా యంగ్ ప్లేయర్ ఆటకు ఫిదా అయ్యాడు ఇర్ఫాన్ పఠాన్. దీంతో అతడికి భారత జట్టులో 15 సంవత్సరాలు ఢోకాలేదని అభిప్రాయపడ్డాడు. మరి ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఓ టీమిండియా యంగ్ ప్లేయర్ ఆటకు ఫిదా అయ్యాడు ఇర్ఫాన్ పఠాన్. దీంతో అతడికి భారత జట్టులో 15 సంవత్సరాలు ఢోకాలేదని అభిప్రాయపడ్డాడు. మరి ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
టీమిండియాలోకి ఎంతో మంది యంగ్ ప్లేయర్లు దూసుకొస్తున్నారు. తమ అద్భుతమైన ఆటతీరుతో రాకెట్ వేగంతో జాతీయ జట్టులోకి వస్తూ.. సత్తాచాటుతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ ద్వారా పదుల సంఖ్యలో యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందులో కొందరు అద్భుత ఫామ్ ను కొనసాగిస్తు టీమ్ లో తమ ప్లేస్ ను సుస్థిరం చేసుకుంటున్నారు. ఇక మిగతావారు విఫలం అవుతూ.. తమ వెనకాల వచ్చేవారికి దారిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం యంగ్ టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్ ను సమం చేసుకున్న ఇరు జట్లు, వన్డే సిరీస్ లో తలపడనున్నాయి. అందులో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టీమిండియా యంగ్ ప్లేయర్ పై ప్రశంసలు కురిపించాడు భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. ఆ యువ ఆటగాడికి టీమిండియాలో 15 ఏళ్లు చోటు ఉంటుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
టీమిండియాలోకి అరంగేట్రం చేసిన ఓ యంగ్ ప్లేయర్ పై భారత మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడి ఆటతీరు చూస్తుంటే భారత జట్టుకు కనీసం 15 సంవత్సరాలు ఆడతాడు అంటూ ఆ యంగ్ ప్లేయర్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఇంతకీ ఆ యువ ప్లేయర్ ఎవరో కాదు.. ‘సాయి సుదర్శన్’. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే ద్వారా అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు సాయి సుదర్శన్. ఆడిన తొలి మ్యాచ్ లోనే అర్దశతకం సాధించి.. ఔరా అనిపించాడు. పేస్ పిచ్ లకు అనుకూలించే సౌతాఫ్రికా గడ్డపై 43 బంతుల్లో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు ఈ యంగ్ ప్లేయర్. ఈ నేపథ్యంలో అతడి ఆటతీరుకు ముగ్దుడైయ్యాడు ఇర్ఫాన్ పఠాన్. సాయి సుదర్శన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ..”సౌతాఫ్రికా లాంటి పేస్ కు అనుకూలించే పిచ్ లపై సాయి సుదర్శన్ ఆట అద్భుతం. అతడు ఈ మ్యాచ్ లో ఆడినతీరు అమోఘం. ఫస్ట్ బాల్ కే ఫోర్ కొట్టి తన స్ట్రాటజీ ఏంటో ప్రత్యర్థులకు తెలియజేశాడు. మీరు అతడి బ్యాటింగ్ ను గమనిస్తే.. స్పిన్ ను, పేస్ ను ఒకే విధంగా భయం లేకుండా ఎదుర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో అతడు కొట్టిన కొన్ని షాట్స్ అమోఘమనే చెప్పాలి. అతడు ఇదే ఫామ్ కనబరిస్తే.. టీమిండియాలో 10 నుంచి 15 ఏళ్లు అతడి ప్లేస్ కు ఢోకాలేదు” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు పఠాన్. సాయి సుదర్శన్ టెంపర్ మెంట్, అతడి ఆటతీరు ఓ సీనియర్ ప్లేయర్ ను తలపిస్తున్నాయని పఠాన్ కితాబిచ్చాడు. ఇక సాయి సుదర్శన్ డొమెస్టిక్ క్రికెట్ తో పాటుగా ఐపీఎల్ లో కూడా అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న సాయి సుదర్శన్ ఫైనల్ మ్యాచ్ లో 96 పరుగులు చేసి అందరిని చూపు తనవైపు తిప్పుకున్నాడు. మరి యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ పై పఠాన్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Irfan Pathan said, “Sai Sudharsan can serve the Indian team for 15 years”. (Star Sports). pic.twitter.com/rcOrSMNlX3
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 18, 2023