వీడియో: అన్న యూసుఫ్‌ పఠాన్‌పై కోపంతో రగిలిపోయిన ఇర్ఫాన్‌ పఠాన్‌!

Irfan Pathan, Yusuf Pathan, WCL 2024: టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసుఫ్‌ పఠాన్‌ తాజాగా ఓ మ్యాచ్‌లో కోపంతో ఊగిపోయారు. తమ్ముడు ఇర్ఫాన్‌.. తన అన్నపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం..

Irfan Pathan, Yusuf Pathan, WCL 2024: టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసుఫ్‌ పఠాన్‌ తాజాగా ఓ మ్యాచ్‌లో కోపంతో ఊగిపోయారు. తమ్ముడు ఇర్ఫాన్‌.. తన అన్నపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం..

పఠాన్‌ బ్రదర్స్‌.. యూసుఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ టీమిండియాకు చాలా కాలం ఆడిన విషయం తెలిసిందే. తమ్ముడు ఇర్ఫాన్‌ పఠాన్‌ తొలుత టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తే.. అన్న యూసుఫ్‌ పఠాన్‌ తర్వాత జట్టులోకి వచ్చారు. ఇద్దరూ 2007లో టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. యూసుఫ్‌ పఠాన్‌ 2011 వన్డే వరల్డ్ కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు. ఇర్ఫాన్‌ పఠాన్‌ 2013లో గెలిచిన ఛాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో ఉన్నాడు. ఇలా ఈ ఇద్దరు అన్నదమ్ములు భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేశారు. అయితే.. తాజాగా ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిన్న మిస్‌ కమ్యూనికేషన్‌ చోటు చేసుకుంది.

వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ 2024 టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా.. బుధవారం నార్తాంప్టన్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో సౌతాఫ్రికా ఛాంపియన్స్‌, ఇండియా ఛాంపియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసుఫ్‌ పఠాన్‌ మధ్య సమన్వయ లోపం జరిగింది. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ తొలి బంతికి ఇర్ఫాన్‌ పఠాన్‌ మిడ్‌ వికెట్‌ దిశగా షాట్‌ ఆడి.. రెండో రన్‌ కోసం ప్రయత్నించాడు. మరో ఎండ్‌లో ఉన్న యూసుఫ్‌ పఠాన్‌ రెండో రన్‌ కోసం నిరాకరించాడు. కానీ, ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రకారం ముందుకు వెళ్లిపోయాడు.

ఈ లోపు బాల్‌ అందుకున్న విలాస్‌ నేరుగా బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌కు అందివ్వడం స్టెయిన్‌ ఆలస్యం చేయకుండా వికెట్లు గిరాలేయడంతో ఇర్ఫాన్‌ పఠాన్‌ రనౌట్‌ అయ్యాడు. ఆగిపో అని యూసుఫ్‌ అరుస్తున్నా.. వినిపించుకోకుండా ముందుకు వచ్చిన ఇర్ఫాన్‌ మళ్లీ తిరిగి వెనక్కి వెళ్లి క్రీజ్‌లోకి చేరుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తప్పు తనదే అయినా.. నో చెప్పవచ్చు కదా అంటూ అన్న యూసుఫ్‌ పఠాన్‌పై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments