iDreamPost
android-app
ios-app

స్టార్‌ క్రికెటర్లకు షాక్‌! భారీగా ఆటగాళ్లను వదిలించుకున్న IPL ఫ్రాంచైజీలు

  • Published Nov 12, 2023 | 12:46 PM Updated Updated Nov 12, 2023 | 12:46 PM

వరల్డ్‌ కప్‌తో బిజీగా ఉన్న ఆటగాళ్లకు అలాగే అభిమానులకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు షాక్‌ ఇచ్చాయి. ఐపీఎల్‌ 2024 నేపథ్యంలో కొంతమంది ఆటగాళ్లను రిలీజ్‌ చేశాయి అన్ని ఫ్రాంచైజీలు. రిలీజ్‌ అయిన ఆటగాళ్ల లిస్ట్‌లో చాలా పెద్ద పెద్ద ఆటగాళ్లు, ఊహించని పేర్లు ఉన్నాయి. ఆ లిస్ట్‌ ఇప్పుడు చూద్దాం..

వరల్డ్‌ కప్‌తో బిజీగా ఉన్న ఆటగాళ్లకు అలాగే అభిమానులకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు షాక్‌ ఇచ్చాయి. ఐపీఎల్‌ 2024 నేపథ్యంలో కొంతమంది ఆటగాళ్లను రిలీజ్‌ చేశాయి అన్ని ఫ్రాంచైజీలు. రిలీజ్‌ అయిన ఆటగాళ్ల లిస్ట్‌లో చాలా పెద్ద పెద్ద ఆటగాళ్లు, ఊహించని పేర్లు ఉన్నాయి. ఆ లిస్ట్‌ ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 12, 2023 | 12:46 PMUpdated Nov 12, 2023 | 12:46 PM
స్టార్‌ క్రికెటర్లకు షాక్‌! భారీగా ఆటగాళ్లను వదిలించుకున్న IPL ఫ్రాంచైజీలు

ప్రస్తుతం క్రికెట్‌ అభిమానులంతా వరల్డ్‌ కప్‌ మానియాలో మునిగిపోయి ఉన్నారు. ఈ వరల్డ్‌ కప్‌ ముగిసిన తర్వాత కొన్ని నెలలకు పొట్టి క్రికెట్‌ పండగ ఐపీఎల్‌ 2024లో జరగనుంది. ధనాధన్‌ క్రికెట్‌లో ఆటగాళ్ల విన్యాసాలతో పాటు.. ఈ సీజన్‌కు ముందు ఐపీఎల్‌ మెగా వేలం జరగనుంది. దీంతో క్రికెటర్లపై కాసులు వర్షం కురవనుంది. అంతకంటే ముందు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు తమ వద్ద ఉన్న ఆటగాళ్లలో కొంతమందిన రిలీజ్‌ చేసింది. అందులో పెద్ద పెద్ద పేర్లే ఉన్నాయి. స్టార్ ఆటగాళ్లు జట్టు తలరాతను మార్చేస్తారని.. 2023 మినీ వేలంగో కోనుగోలు చేసిన జట్లు.. వాళ్లు తెలిపోవడంతో తాజా వారిని రిలీజ్‌ చేశారు. ఆయా ఫ్రాంచైజీల నుంచి రిలీజ్‌ అయిన ఆటగాళ్లు వేలంలో అందుబాటులో ఉంటారు. మరి ఏ ఫ్రాంచైజ్‌ ఎవరిని రిలీజ్‌ చేసిందో ఇప్పుడు చూద్దాం..

ఢిల్లీ క్యాపిటల్స్

  • పృథ్వీ షా(రూ.7.5 కోట్ల)
  • మనీశ్ పాండే(రూ.2.4 కోట్లు)
  • ముస్తాఫిజుర్ రెహ్మాన్(రూ.కోటి)
  • లుంగి ఎంగిడి(రూ.5 లక్షలు)
  • రిపాల్ పటేల్(రూ.20 లక్షలు)

చెన్నై సూపర్ కింగ్స్

  • బెన్ స్టోక్స్ (రూ.16.25 కోట్లు)
  • అంబటి రాయడు (రూ.6.75 కోట్లు)
  • కైల్ జెమీసన్ (రూ. కోటి)
  • సిసండ మగలా (రూ.50 లక్షలు)
  • సిమ్రన్‌జీత్ సింగ్ (రూ.20 లక్షలు)
  • షేక్ రషీద్ (రూ.20 లక్షలు)

లక్నో సూపర్ జెయింట్స్

  • ఆవేశ్ ఖాన్ (రూ.10 కోట్లు)
  • డానియల్ సామ్స్ (రూ.75 లక్షలు)
  • జయదేవ్ ఉనాద్కత్ (రూ.50 లక్షలు)
  • రోమారియో షెఫర్డ్ (రూ.50 లక్షలు)(ట్రేడ్)
  • సూర్యాన్ష్ షెగ్దే (రూ.20 లక్షలు)

గుజరాత్ టైటాన్స్

  • యశ్ దయాల్ (రూ.3.2 కోట్లు)
  • డసన్ షనక (రూ.2 కోట్లు)
  • ఓడియన్ స్మిత్ (రూ.50 లక్షలు)
  • ప్రదీప్ సంగ్వాన్ (రూ.20 లక్షలు)
  • ఉర్విల్ పటేల్ (రూ.20 లక్షలు)

ముంబై ఇండియన్స్

  • జోఫ్రా ఆర్చర్ (రూ.8 కోట్లు)
  • క్రిస్ జోర్డాన్ (రూ.50 లక్షలు)
  • డౌన్ జాన్సెన్ (రూ.20 లక్షలు)
  • ట్రిస్టాన్ స్టబ్స్ (రూ.20 లక్షలు)
  • అర్షద్ ఖాన్ (రూ.20 లక్షలు)

పంజాబ్ కింగ్స్

  • రాహుల్ చాహర్ (రూ.5.2 కోట్లు)
  • హర్ష్‌త్ భాటియా (రూ.40 లక్షలు)
  • మాథ్యూ షార్ట్ (రూ.20 లక్షలు)
  • బాల్తేజ్ ధండా (రూ.20 లక్షలు)

రాజస్థాన్ రాయల్స్

  • జాసన్ హోల్డర్ (రూ.5.75 కోట్లు)
  • జోరూట్ (రూ.కోటి)
  • కేసీ కరియప్ప (రూ.30 లక్షలు)
  • మురుగన్ అశ్విన్ (రూ.20 లక్షలు)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

  • హర్షల్ పటేల్ (రూ.10 కోట్లు)
  • దినేశ్ కార్తీక్ (రూ.5.5 కోట్లు)
  • అనుజ్ రావత్ (రూ.3.4 కోట్లు)
  • ఫిన్ అలెన్ (రూ.80 లక్షలు)

సన్‌రైజర్స్ హైదరాబాద్

  • హ్యారీ బ్రూక్ (రూ.13.25 కోట్లు)
  • మయాంక్ అగర్వాల్ (రూ.8.25 కోట్లు)
  • ఆదిల్ రషీద్ (రూ.2 కోట్లు)
  • అకీల్ హొస్సెన్ (రూ.కోటి)

కోల్‌కతా నైట్‌రైడర్స్

  • ఆండ్రూ రస్సెల్ (రూ.12 కోట్లు)
  • లాకీ ఫెర్గూసన్ (రూ.10 కోట్లు)
  • డేవిడ్ వైస్ (రూ.కోటి)
  • షకీబ్ అల్ హసన్ (రూ.50 లక్షలు)
  • జాన్సన్ చార్లెస్ (రూ.50 లక్షలు)
  • మన్‌దీప్ సింగ్ (రూ.50 లక్షలు)