Nidhan
పించ్ హిట్టర్ రింకూ సింగ్ చేతిలో గత ఐపీఎల్లో ఓ బౌలర్ బలైన సంగతి తెలిసిందే. అయితే ఆ పేసర్‌కు పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
పించ్ హిట్టర్ రింకూ సింగ్ చేతిలో గత ఐపీఎల్లో ఓ బౌలర్ బలైన సంగతి తెలిసిందే. అయితే ఆ పేసర్‌కు పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
Nidhan
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం అనుకున్న దాని కంటే చాలా రసవత్తరంగా సాగింది. భారీ ధరకు పోతారనుకున్న కొందరు ప్లేయర్లను అసలు ఏ జట్టూ పట్టించుకోలేదు. ఓ మాదిరి ధరకు పోతారనుకున్న వారిని రూ.కోట్లకు రూ.కోట్లు ఖర్చు పెట్టి మరీ దక్కించుకున్నాయి ఫ్రాంచైజీలు. ఈసారి ఆక్షన్‌లో బౌలర్లకు మంచి గిరాకీ పలికింది. ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్యాట్ కమిన్స్ (రూ.20.50 కోట్లు), మిచెల్ స్టార్క్ (24.75 కోట్లు) జాక్‌పాట్ కొట్టేశారు. పదహారేళ్ల లీగ్ చరిత్రలో అత్యంత భారీ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా స్టార్క్ రికార్డు సృష్టించాడు. ఈసారి బౌలర్ల కోసం భారీగా బిడ్డింగ్ చేశాయి టీమ్స్. ఇది ఒక ప్లేయర్‌కు బాగా కలిసొచ్చింది. అతడే యష్ దయాల్. ఒకట్రెండు కోట్లకు పోయినా గొప్పే అనుకుంటే అతడ్ని ఊహించని ధరకు తీసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
యష్ దయాల్‌ను ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు పెట్టి మరీ టీమ్‌లోకి తెచ్చుకుంది ఆర్సీబీ. గత ఆక్షన్‌లో రూ.3.2 కోట్లకు అమ్ముడుపోయిన దయాల్‌కు ఇంత ధర పెట్టడం కాస్త సాహసమనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్లో అతడు గుజరాత్ టైటాన్స్‌కు ఆడాడు. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో బాగా పరుగులు సమర్పించుకున్నాడు. యష్ వేసిన ఓ ఓవర్లో కేకేఆర్ పించ్ హిట్టర్ రింకూ సింగ్ వరుసగా 5 సిక్సులు బాదాడు. ఆ మ్యాచ్ తర్వాత అనారోగ్యం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. రింకూ విధ్వంసం నుంచి చాన్నాళ్ల వరకు బయటపడలేకపోయాడు యష్. ఈ క్రమంలో ఏకంగా 7 నుంచి 8 కిలోలు బరువు కూడా తగ్గాడు. దీంతో ఈసారి వేలంలో అతడ్ని ఎవరూ తీసుకోకపోవచ్చని అనుకున్నారు. కానీ అతడి కోసం భారీగా బిడ్ చేసి సొంతం చేసుకుంది ఆర్సీబీ.
రింకూ చేతిలో బలైన యష్ కోసం బెంగళూరు ఇంతగా ఖర్చు చేయడానికి ఓ కారణం ఉంది. గత ఐపీఎల్లో ఫెయిలైనప్పటికీ ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్లో రాణించాడు యష్ దయాల్. విజయ్ హజారే ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లోనూ సత్తా చాటాడు. దీంతో అతడ్ని తీసుకోవాలని అనుకుంది ఆర్సీబీ. లెఫ్టార్మ్ పేసర్ కావడం, బంతిని మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో సరైన ఏరియాలో పిచ్ చేసే సత్తా ఉండటంతో యష్ కోసం పట్టుబట్టింది. ఈ స్పీడ్‌స్టర్ టీమ్‌లోకి రావడాన్ని ఆర్సీబీ ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారు. ఆల్రెడీ జట్టులో కేజీఎఫ్ (కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాప్ డుప్లెసిస్) ఉన్నారని.. ఇప్పుడు యష్ కూడా వచ్చేశాడని అంటున్నారు. ఇది కేజీఎఫ్ యష్ అడ్డాగా మారిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. యష్ దయాల్ కోసం ఆర్సీబీ రూ.5 కోట్లు ఖర్చు చేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2024 Auction: CSKలోకి తెలుగు కుర్రాడు.. అవనీశ్ రావుకు ఛాన్స్ ఇచ్చిన చెన్నై!
Our scouting team has been watching his progress and hunger to improve his game. Watch out for this lethal leftie! 💪
Yash Dayal is #NowARoyalChallenger 👏#PlayBold #BidForBold #IPLAuction #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/gFLxbPTV2v
— Royal Challengers Bangalore (@RCBTweets) December 19, 2023