Nidhan
ఈసారి ఐపీఎల్ ఆక్షన్‌లో ఓ క్రికెటర్ మోస్ట్ అన్‌లక్కీగా నిలిచాడు. అతడికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదనే చెప్పాలి. ఆ ప్లేయర్ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఈసారి ఐపీఎల్ ఆక్షన్‌లో ఓ క్రికెటర్ మోస్ట్ అన్‌లక్కీగా నిలిచాడు. అతడికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదనే చెప్పాలి. ఆ ప్లేయర్ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఐపీఎల్-2024 ఆక్షన్ ఇటు అభిమానులతో పాటు అటు మాజీ క్రికెటర్లు, క్రికెట్ అనలిస్టులను కూడా ఆశ్చర్యపర్చింది. ఏయే ప్లేయర్ ఎంత ధరకు, ఏ టీమ్‌కు పోతాడనేది చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఈసారి చాలా జట్లలో బౌలర్ల కొరత ఉంది. దీంతో బౌలర్లకు మంచి డిమాండ్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ కొందరు పేసర్లను ఊహించని ధరకు దక్కించుకున్నాయి ఫ్రాంచైజీలు. మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు), ప్యాట్ కమిన్స్ (రూ.20.50 కోట్లు) ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ధరకు అమ్ముడుపోయారు. పదహారేళ్ల ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత భారీ ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్‌గా స్టార్క్ నయా రికార్డును క్రియేట్ చేశాడు. ఇక, మంచి ధర పలికిన ఆటగాళ్లు సంతోషంలో ఉంటే.. ఎంతో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వేలంలో నిలిచి అన్‌సోల్డ్‌గా నిలిచిన ప్లేయర్లు బాధలో మునిగిపోయారు. అందులో ఒకడు ఇంగ్లండ్ పించ్ హిట్టర్ ఫిల్ సాల్ట్. ఈసారి ఆక్షన్‌లో మోస్ట్ అన్‌లక్కీ క్రికెటర్ అతడే అని చెప్పాలి.
ఈ మధ్య కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న సాల్ట్ వరుసగా ఫెంటాస్టిక్ నాక్స్ ఆడుతున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్-2024 ఆక్షన్‌కు ముందు విండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 56 బంతుల్లోనే 109 రన్స్ చేశాడు సాల్ట్. అతడి ఇన్నింగ్స్‌లో 4 బౌండరీలు ఉంటే ఏకంగా 9 సిక్సులు ఉన్నాయి. సరిగ్గా ఐపీఎల్ వేలం జరిగిన నెక్స్ట్ రోజు అంటే బుదవారం నాటి మ్యాచ్‌లో మళ్లీ కరీబియన్ టీమ్ మీద మరో సెంచరీ బాదాడతను. ఈసారి 57 బంతుల్లోనే ఏకంగా 119 రన్స్ చేశాడు. ఇంతటి భీకర ఫామ్‌లో ఉన్న సాల్ట్‌కు క్యాష్ రిచ్ లీగ్‌లోని ఏదో ఒక టీమ్ దక్కించుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క జట్టు కూడా అతడ్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపలేదు.
భారీ ధరకు అమ్ముడుపోతాడని అనుకున్న సాల్ట్‌ను ఎవరూ తీసుకోలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడుతున్న సాల్ట్‌ను ఎవరూ పట్టించుకోకపోవడం కాస్త షాకింగ్ అనే చెప్పాలి. అయితే చాలా టీమ్స్‌లో మంచి ఓవర్సీస్ బ్యాటర్స్ ఉండటం, బౌలర్ల కొరత వల్ల వాళ్ల మీదే ఎక్కువ ఫోకస్ చేయడంతో సాల్ట్ లాంటి కొందరు స్టార్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. ఈ ఇంగ్లీష్ బ్యాటర్‌తో పాటు మరికొందరు ప్రముఖ క్రికెటర్లు వేలంలో అన్‌సోల్డ్‌గా ఉండిపోయారు. వాళ్లలో స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, కుషాల్ మెండిస్, కరుణ్ నాయర్, జోష్ హేజల్‌వుడ్, ఆదిల్ రషీద్, ఇష్ సోధి, సర్ఫరాజ్ ఖాన్, వాండర్ డస్సెన్, కొలిన్ మన్రో, జేమ్స్ నీషమ్ లాంటి వాళ్లు ఉన్నారు. మరి.. అన్‌సోల్డ్ క్రికెటర్లలో సాల్ట్ కంటే అన్‌లక్కీ ఇంకా ఎవరైనా ఉన్నారని భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: MS Dhoni, Rishabh Pant: దుబాయ్‌లో ధోని, పంత్ కొత్త అవతారం! వీడియో వైరల్..
Phil Salt smashed a century before IPL auction.
Phil Salt smashed a century after IPL auction.
– A great talent from England went unsold…!!!pic.twitter.com/hQAt4F0L3U
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 20, 2023