iDreamPost
android-app
ios-app

IPL 2024: రూ. 400 కోట్ల లాభం వస్తోంది చాలదా? ఇంకేం కావాలి? సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్!

  • Published May 13, 2024 | 3:00 PM Updated Updated May 13, 2024 | 3:00 PM

ఐపీఎల్  ఫ్రాంచైజీ ఓనర్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్. టోర్నీలో టీమ్స్ ను ముందుండి నడిపించేది కోచ్, కెప్టెన్ అని ఇందులో ఓనర్ల జోక్యం అనవసరం అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్  ఫ్రాంచైజీ ఓనర్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్. టోర్నీలో టీమ్స్ ను ముందుండి నడిపించేది కోచ్, కెప్టెన్ అని ఇందులో ఓనర్ల జోక్యం అనవసరం అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

IPL 2024: రూ. 400 కోట్ల లాభం వస్తోంది చాలదా? ఇంకేం కావాలి? సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్ ల గురించి, ప్లేయర్ల ఆటతీరు గురించి తనదైన శైలిలో స్పందిస్తుంటాడు టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. ఛలోక్తులు విసురుతూ.. సెటైరికల్ గా కౌంటర్లు వేయడంలో సిద్ధహస్తుడు వీరూ భాయ్. తాజాగా ఐపీఎల్  ఫ్రాంచైజీ ఓనర్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. టోర్నీలో టీమ్స్ ను ముందుండి నడిపించేది కోచ్, కెప్టెన్ అని ఇందులో ఓనర్ల జోక్యం అనవసరం అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ షాకింగ్ కామెంట్స్ చేయడానికి కారణం ఏంటంటే?

ఐపీఎల్ 2024లో భాగంగా ఇటీవలే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో లక్నో దారుణంగా ఓడిపోవడంతో.. ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా గ్రౌండ్ లనే కెప్టెన్ కేఎల్ రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో పాటుగా కోచ్ జస్టిన్ లాంగర్ పై కూడా ఇదే తరహా ప్రవర్తన చూపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై కాస్త లేట్ గా స్పందించినా.. ఘాటుగా స్పందించాడు వీరేంద్ర సెహ్వాగ్.

“SRHపై మ్యాచ్ ఓడిపోయిన తర్వాత లక్నో ఓనర్ కేఎల్ రాహుల్ తో వ్యవహరించిన తీరు సరిగ్గా లేదు. మ్యాచ్ ఓడిపోతే డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడుకోవాలి. అదికూడా వారిలో స్ఫూర్తి నింపేలా మాట్లాడాలి. కానీ ఇలా అందరి ముందు తిట్టడం సరైన పద్దతి కాదు. అసలు టీమ్ నడిపించేది కోచ్, కెప్టెన్, మధ్యలో ఓనర్లు ఇన్ వాల్వ్ కాకూడదు. వారు కేవలం లాభనష్టాలు మాత్రమే చూసుకుంటారు. అయినా మీకు రూ. 400 కోట్ల లాభం వస్తుంది కదా? ఇంకేం కావాలి? ఓనర్లకు లాభాలు చూసుకునే పని తప్ప మరో పనిలో జోక్యం చేసుకోకూడదనేది నా అభిప్రాయం. ఇలా వ్యవహరించడంతో ఆటగాళ్లు వేరే ఫ్రాంచైజీలకు వెళ్లిపోతే.. అది మీకే నష్టం” అంటూ క్రిక్ బజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు వీరూ భాయ్. మరి ఫ్రాంచైజీల ఓనర్లపై సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో, కామెంట్స్ రూపంలో తెలియజేయండి.