iDreamPost
android-app
ios-app

Virender Sehwag: ఆ ‘కెప్టెన్‌’కు తుదిజట్టులో ఉండే అర్హత కూడా లేదు! తిట్టిపోసిన సెహ్వాగ్!

  • Published Apr 22, 2024 | 6:49 PM Updated Updated Apr 22, 2024 | 6:49 PM

వరుస మ్యాచ్ ల్లో విఫలం అవుతున్న ఓ స్టార్ ప్లేయర్ కు ఆ జట్టులో ఉండే అర్హత లేదంటూ విమర్శలు గుప్పించాడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.

వరుస మ్యాచ్ ల్లో విఫలం అవుతున్న ఓ స్టార్ ప్లేయర్ కు ఆ జట్టులో ఉండే అర్హత లేదంటూ విమర్శలు గుప్పించాడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.

Virender Sehwag: ఆ ‘కెప్టెన్‌’కు తుదిజట్టులో ఉండే అర్హత కూడా లేదు! తిట్టిపోసిన సెహ్వాగ్!

ఈ ఐపీఎల్ సీజన్లలో దుమ్మురేపుతున్నారు యంగ్ టీమిండియా క్రికెటర్లు. సీనియర్ ప్లేయర్లను తలదన్నుతూ.. సూపర్బ్ నాక్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే గత సీజన్లలో రాణించిన కొంత మంది సీనియర్ ఆటగాళ్లను మళ్లీ రీటైన్ చేసుకున్నాయి కొన్ని జట్లు. కానీ అప్పుడు ఆడినట్లుగా ఈ సీజన్ లో మెరుపులు మెరిపించలేకపోతున్నారు సదరు ప్లేయర్లు. దీంతో టీమ్ కు భారంగా మారుతూ.. టీమ్ లో వేస్ట్ అనే స్థాయికి వచ్చారు. తాజాగా ఓ టీమ్ కెప్టెన్ కు ఆ జట్టులో ఉండే అర్హత లేదంటూ విమర్శలు గుప్పించాడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.

పంజాబ్ కింగ్స్ తాత్కాలిక కెప్టెన్ సామ్ కర్రన్ పై ఘాటు విమర్శలు చేశాడు టీమిండియా మాజీ ఓపెనర్, డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. సామ్ కర్రన్ కు అసలు పంజాబ్ జట్టులో ఉండే అర్హత లేదంటూ మండిపడ్డాడు. వీరూ భాయ్ మాట్లాడుతూ..”సామ్ కర్రన్ లాంటి ప్లేయర్ టీమ్ లో ఉండి ఎలాంటి ఉపయోగం లేదు. ఇక నేను అతడిని బ్యాటింగ్ ఆల్ రౌండర్, బౌలింగ్ ఆల్ రౌండర్ గానూ పరిగణించలేను. ఎందుకంటే? బ్యాటింగ్ తోనైనా, బౌలింగ్ తోనైనా మ్యాచ్ ను గెలిపించినప్పుడే నీ ఆటకు విలువ. అలా చేయలేనప్పుడు టీమ్ కు నీ వల్ల ఉపయోగం ఏంటి? జట్టులో నువ్వుండి ప్రయోజం ఏంటి?” అంటూ మండిపడ్డాడు సెహ్వాగ్.

కాగా.. సామ్ కర్రన్ గత ఐపీఎల్ లో నామమాత్రపు ప్రదర్శనే ఇచ్చాడు. గత సీజన్ లో 276 పరుగులు చేసి 10 వికెట్లు తీశాడు. పెద్దగా రాణించకపోయినప్పటికీ.. పంజాబ్ ఐపీఎల్ 2024 సీజన్ కోసం కర్రన్ ను రూ. 18.5 కోట్లకు రీటైన్ చేసుకుంది. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం అవుతూ వస్తున్నాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. ఈ సీజన్ లో బౌలింగ్, బ్యాటింగ్ లో విఫలం అవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లో 152 పరుగులు చేయడంతో పాటుగా 11 వికెట్లు తీశాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సైతం ఆకట్టుకోలేకపోయాడు. ఈ మ్యాచ్ లో 19 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్ లో 2 ఓవర్లలో 18 రన్స్ ఇచ్చి.. ఓ వికెట్ మాత్రమే తీశాడు. ఇక గాయం కారణంగా శిఖర్ ధావన్ గత రెండు మ్యాచ్ లకు దూరం కాగా.. అతడి ప్లేస్ లో కెప్టెన్ గా పగ్గాలు అందుకున్న సామ్ కర్రన్ కెప్టెన్ గానూ దారుణంగా విఫలం అయ్యాడు. దీంతో వీరూ భాయ్ అతడిపై విమర్శలు గుప్పించాడు.