iDreamPost
android-app
ios-app

Virat Kohli: సెంచరీతో రాజస్తాన్ బౌలర్లను చీల్చిచెండాడిన విరాట్!

  • Published Apr 06, 2024 | 9:08 PM Updated Updated Apr 06, 2024 | 9:19 PM

రాజస్తాన్ రాయల్స్ బౌలర్లను ఉతికారేశాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్ లో వారికి చుక్కలు చూపిస్తూ.. శతకంతో కదంతొక్కాడు.

రాజస్తాన్ రాయల్స్ బౌలర్లను ఉతికారేశాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్ లో వారికి చుక్కలు చూపిస్తూ.. శతకంతో కదంతొక్కాడు.

Virat Kohli: సెంచరీతో రాజస్తాన్ బౌలర్లను చీల్చిచెండాడిన విరాట్!

ఐపీఎల్ 2024 లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. రాజస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఫోర్లు, సిక్సర్లతో శతకం సాధించాడు. దీంతో ఈ సీజన్ లో తొలి సెంచరీ చేసిన బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటికే టోర్నీలో టాప్ స్కోరర్ గా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్న విరాట్.. ఈ సెంచరీతో మరింత పైకెళ్లాడు. ఈ మ్యాచ్ లో 67 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు విరాట్ భాయ్.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు ఓపెనర్లు విరాట్-డుప్లెసిస్ లు రాజస్తాన్ బౌలర్లను దంచికొడుతూ.. తొలి వికెట్ కు కేవలం 13.6 ఓవర్లలో 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 33 బంతుల్లో 44 పరుగులు చేసిన కెప్టెన్ డు ప్లెసిస్ ను చాహల్ అవుట్ చేశాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన మాక్స్ వెల్(1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. కొత్త కుర్రాడు సౌరభ్ చౌహాన్(9) కూడా విఫలమైయ్యాడు. ఓపెనర్లు అందించిన సూపర్ స్టార్ట్ ను భారీ స్కోర్ గా మలుచుకోవడంలో ఆర్సీబీ ప్లేయర్లు పూర్తిగా విఫలమైయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కల్పోయి 183 పరుగులు మాత్రమే చేసింది. కోహ్లీ సెంచరీతో ఆదుకున్నాడు.. లేకపోతే ఈ మాత్రం స్కోర్ కూడా వచ్చేది కాదేమో. ఓవరాల్ గా విరాట్ 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.