Nidhan
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడో సీజన్‌కు ముందు మినీ ఆక్షన్‌కు అంతా రెడీ అయింది. ఫస్ట్ టైమ్ ఇండియాకు వెలుపల దుబాయ్‌లో ఈ వేలాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి ఏకంగా 333 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు. వీరిలో 214 మంది భారత క్రికెటర్లు ఉండటం గమనార్హం. మిగిలిన 119 మంది ఫారెనర్స్లో ఇద్దరు అసోసియేట్ కంట్రీస్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ మొత్తంలో ఇంటర్నేషనల్ క్రికెటర్స్ సంఖ్య 116. ఐపీఎల్‌లోని 10 టీమ్స్ కలసి గరిష్టంగా 77 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇందులో 30 మంది ఫారెన్ ప్లేయర్ల కోటా స్థానాలు. న్యూజిలాండ్ యంగ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర, ఆస్ట్రేలియా సీనియర్ పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హేజల్‌వుడ్ మీద అన్ని ఫ్రాంచైజీలు కన్నేశాయి. ఈ తరుణంలో ఐపీఎల్ నెక్స్ట్ సీజన్ షెడ్యూల్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే సంవత్సరం మార్చి 22న క్యాష్ రిచ్ లీగ్ ఆరంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
మార్చి 22వ తేదీన మొదలై రెండు నెలల పాటు సుదీర్ఘంగా సాగనున్న ఈ సీజన్ మే ఆఖరి నాటికి పూర్తవుతుందని సమాచారం. అయితే వచ్చే ఏడాది ఎండాకాలంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన తర్వాత దానికి అనుగుణంగా ఐపీఎల్-2024 షెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. జనరల్ ఎలక్షన్స్ పోలింగ్ డేట్స్ ఫిక్స్ అయ్యాక ఐపీఎల్ పదిహేడో సీజన్ షెడ్యూల్ విడుదలవుతుందని ఓ ప్రముఖ నేషనల్ క్రికెట్ వెబ్సైట్ వెల్లడించింది. ఇక, ఐపీఎల్ నెక్స్ట్ సీజన్ కోసం ఇప్పటి నుంచే హంగామా షురూ అయింది. ఇవాళ వేలం జరగనుండటంతో అన్ని ఫ్రాంచైజీలు ప్రిపరేషన్స్‌లో మునిగిపోయాయి. ఆక్షన్‌లో బెస్ట్ ప్లేయర్స్‌ను దక్కించుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి. తమ టీమ్ కాంబినేషన్‌కు సెట్ అయ్యే ఆటగాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలుకోవద్దని ఫిక్స్ అయ్యాయి.
ఐపీఎల్-2024 సీజన్ వేలం దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో మంగళవారం జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇది మొదలవనుంది. ఈ ఆక్షన్ ప్రక్రియ మొత్తం స్టార్ స్పోర్ట్స్ (టెలివిజన్), జియో సినిమా (డిజిటల్)లో లైవ్ టెలికాస్ట్ కానుంది. ఈసారి వేలంలో స్టార్క్, రచిన్ రవీంద్ర, హేజల్వుడ్పై అన్ని ఫ్రాంచైజీల ఫోకస్ ఉంది. అయితే వీళ్లతో పాటు సౌతాఫ్రికా యంగ్ పేసర్ గెరాల్డ్ కొయెట్జీ, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మీద కూడా అందరి దృష్టి ఉంది. ఈసారి వేలంలో ఈ ఆటగాళ్లు గత రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. వీళ్లలో ఎవరో ఒకరు రూ.20 కోట్లకు అమ్ముడుపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మరి.. ఐపీఎల్ కొత్త సీజన్ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2024: ఐపీఎల్లో మరో కొత్త రూల్.. ఇక బ్యాటర్లకు మూడినట్లే..!
The final schedule will be announced after the Election Commission finalizes the polling dates for India’s general elections 2024. pic.twitter.com/xkYJ9C6C8y
— CricTracker (@Cricketracker) December 18, 2023