iDreamPost
android-app
ios-app

SRH vs MI: వీడియో: పాండ్యా కాస్త పొగరు తగ్గించుకో.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

  • Published Mar 28, 2024 | 10:41 AM Updated Updated Mar 28, 2024 | 10:41 AM

సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ చేసిన ఓవరాక్షన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్లు పాండ్యా కాస్త పొగరు తగ్గించుకో అంటూ ఫైర్ అవుతున్నారు.

సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ చేసిన ఓవరాక్షన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్లు పాండ్యా కాస్త పొగరు తగ్గించుకో అంటూ ఫైర్ అవుతున్నారు.

  • Published Mar 28, 2024 | 10:41 AMUpdated Mar 28, 2024 | 10:41 AM
SRH vs MI: వీడియో: పాండ్యా కాస్త పొగరు తగ్గించుకో.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే గుజరాత్ నుంచి వచ్చి ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా నియామకం అయ్యాడో.. అప్పటి నుంచి అతడిపై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. ఈ విమర్శలకు తోడు దురదృష్టం కూడా అతడిని వెంటాడుతూనే వస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ పరాజయం పాలై అందరిచేత తిట్లు తింటున్నాడు. తాజాగా సన్ రైజర్స్ చేతిలో 31 రన్స్ తేడాతో పాండ్యా సేన ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో హార్దిక్ చేసిన ఓవరాక్షన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్లు పాండ్యా కాస్త పొగరు తగ్గించుకో అంటూ ఫైర్ అవుతున్నారు.

కుడితిలో పడ్డ ఎలక పిల్లలా తయ్యారైంది హార్దిక్ పాండ్యా పరిస్థితి. ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ అయిన ఆనందం పాపం పాండ్యాకు లేదు. ఈ సీజన్ లో గుజరాత్, హైదరాబాద్ జట్లపై ఓడిపోవడంతో.. హార్దిక్ పై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ 31 రన్స్ తో సన్ రైజర్స్ చేతిలో చావుదెబ్బ తిన్నది ముంబై టీమ్. అయితే ఈ మ్యాచ్ లో పాండ్యా బ్యాటింగ్ వచ్చేటప్పుడు గ్రౌండ్ లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తన యాటిట్యూడ్ తో స్టెప్పులు వేస్తూ.. ఏదో ఘనకార్యం సాధించినట్లుగా క్రీజ్ లోకి అడుగుపెట్టాడు.

ఇంత ఓవరాక్షన్ చేసిన పాండ్యా భారీ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడా? అంటే అదికూడా లేదు. గెలిపించకపోవడం అటుంచి.. 20 బంతుల్లో 24 పరుగులు చేసి ఒకవిధంగా ఓటమికి కారణమైయ్యాడు. దీంతో నీకు ఇంత యాటిట్యూడ్ ఎందుకు హార్దిక్.. కాస్త పొగరు తగ్గించుకో. ఇన్ని విమర్శలు, రెండు ఓటములు చవిచూసినా గానీ పాండ్యా తన పొగరు ఇంకా తగ్గించుకోలేదని ఇకనైనా కాస్త మారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి నెటిజన్లు పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by 𝘗𝘳𝘪𝘺𝘢𝘯𝘴𝘩𝘶 (@ninedits18)

ఇదికూడా చదవండి: SRH vs MI: ఒక్క మ్యాచ్ లో ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో చూడండి..

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş