Somesekhar
ఆ యంగ్ ప్లేయర్ టీమిండియాకు దొరికిన ఓ అద్భుతమని, క్రికెట్ లో అతడు రికార్డుల మీద రికార్డులు సృష్టించడం ఖాయమని సన్ రైజర్స్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ పొగడ్తల వర్షం కురిపించాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆ యంగ్ ప్లేయర్ టీమిండియాకు దొరికిన ఓ అద్భుతమని, క్రికెట్ లో అతడు రికార్డుల మీద రికార్డులు సృష్టించడం ఖాయమని సన్ రైజర్స్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ పొగడ్తల వర్షం కురిపించాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
IPL టోర్నీ ఎప్పుడైతే ప్రారంభం అయ్యిందో.. అప్పటి నుంచి కుప్పలు తెప్పలుగా యంగ్ ప్లేయర్లు వెలుగులోకి వస్తున్నారు. తమ అద్భుత ఆటతీరుతో టీమిండియాలోకి దూసుకొస్తున్నారు ఈ యువ ఆటగాళ్లు. మరీ ముఖ్యంగా ఈ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపే ఆటతో కొందరు ఆటగాళ్లు ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఓ భారత యంగ్ ప్లేయర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, సన్ రైజర్స్ మెరుపు వీరుడు ట్రావిస్ హెడ్. ఆ ఆటగాడు భారత క్రికెట్ లో ఓ అద్భుతం అని, సంచలనాలు సృష్టిస్తాడని అందులో ఎలాంటి సందేహం లేదని కితాబిచ్చాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.
ట్రావిస్ హెడ్.. ఈ ఐపీఎల్ సీజన్ లో థండర్ ఇన్నింగ్స్ లతో బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాడు. బంతి ఎక్కడ వేసినా.. వెళ్లేది మాత్రం స్టాండ్స్ లోకే అన్నట్లుగా అతడు బాదుతున్నాడు. హెడ్ క్రీజ్ లో ఉంటే, ప్రత్యర్థి గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే. అంతలా చెలరేగిపోతుంటాడు హెడ్. ఇక తాజాగా ఉప్పల్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు పరుగుల సునామీ ఎలా ఉంటుందో.. కళ్లారా చూపించారు. లక్నో విధించిన 166 పరుగుల టార్గెట్ ను వికెట్ నష్టపోకుండా కేవలం 9.4 ఓవర్లలోనే దంచికొట్టి.. ప్రపంచ క్రికెట్ ను షాక్ కు గురిచేశారు. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులతో 75*, ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సులతో 89* పరుగులు చేసి.. జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించారు.
ఇదిలా ఉండగా.. మ్యాచ్ అనంతరం ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. “ఈ మ్యాచ్ ను కేవలం 10 ఓవర్లలోపే ముగించడం సంతోషంగా ఉంది. ఇక యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మతో కలిసి ఆడటం థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఈ సీజన్ లో గత మ్యాచ్ ల్లో మా నుంచి ఇలాంటి పార్ట్ నర్ షిప్స్ వచ్చాయి. కానీ గత రెండు మ్యాచ్ ల్లో నిరాశకలిగించాము. అయితే అభిషేక్ దూకుడుగా ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడతాడు. పైగా స్పిన్, పేస్ ను చాలా సులువుగా ఎదుర్కొగలడు. నెట్స్ లో అతడు ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. అభిషేక్ టీమిండియాకు దొరికిన ఓ అద్భుతం. క్రికెట్ లో సంచలనాలు సృష్టించే సత్తా గల ప్లేయర్, ఇందులో ఎలాంటి సందేహం లేదు” అంటూ యంగ్ ప్లేయర్ పై పొగడ్తల వర్షం కురిపించాడు.
Travis Head said “Abhishek Sharma is an exciting talent for Indian cricket”. pic.twitter.com/CiqZuJJyk2
— Johns. (@CricCrazyJohns) May 9, 2024