iDreamPost
android-app
ios-app

తల్లి ఆస్పత్రిలో.. KKR కోసం IPLలోకి! ఆఫ్గాన్ ఆటగాడి డెడికేషన్ కు హ్యాట్సాఫ్!

  • Published May 22, 2024 | 11:51 AM Updated Updated May 22, 2024 | 11:51 AM

సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో కేకేఆర్ స్టార్ ఓపెనర్, ఆఫ్గాన్ ప్లేయర్ రహ్మనుల్లా గుర్భాజ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతడు వచ్చిన పరిస్థితులు చూస్తే.. క్రికెట్, కేకేఆర్ పై అతడికున్న డెడికేషన్ కు మీరు హ్యాట్సాఫ్ అనాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..

సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో కేకేఆర్ స్టార్ ఓపెనర్, ఆఫ్గాన్ ప్లేయర్ రహ్మనుల్లా గుర్భాజ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతడు వచ్చిన పరిస్థితులు చూస్తే.. క్రికెట్, కేకేఆర్ పై అతడికున్న డెడికేషన్ కు మీరు హ్యాట్సాఫ్ అనాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..

తల్లి ఆస్పత్రిలో.. KKR కోసం IPLలోకి! ఆఫ్గాన్ ఆటగాడి డెడికేషన్ కు హ్యాట్సాఫ్!

స్టార్ క్రికెటర్ అయినంత మాత్రానా అతడికి ఎలాంటి కష్టాలు ఉండవు అనుకుంటే పొరపాటే. ఒకవైపు ఫామ్, మరోవైపు ఫిట్ నెస్, గాయలు కాకుండా కాపాడుకోవడం, ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి రావడం. ఇలాంటివన్నీ ఆటగాళ్లకు ఉంటాయి. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఉన్నా.. కొన్ని కొన్నిసార్లు ఆటకోసం వారికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం అదే చేశానని తన బాధను చెప్పుకొచ్చాడు ఆఫ్గానిస్తాన్ స్టార్ ప్లేయర్, కేకేఆర్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్భాజ్. తన తల్లి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుందని, కానీ కేకేఆర్ టీమ్ పై ప్రేమతో అమ్మకు చెప్పి వచ్చానని గుర్భాజ్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024లో భాగంగా సన్ రైజర్స్ తో జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్ ముందు కేకేఆర్ టీమ్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్ ఇంగ్లండ్ వెళ్లాడు. దాంతో అతడి స్థానంలో ఆఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్భాజ్ ను టీమ్ లోకి తీసుకున్నారు. అతడు ఈ మ్యాచ్ లో అద్భుతమైన కీపింగ్ తో రెండు క్యాచ్ అవుట్స్ తో పాటుగా ఓ రనౌట్ లో కూడా భాగమైయ్యాడు. బ్యాటింగ్ లో 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 23 పరుగులు చేశాడు. అయితే గుర్భాజ్ టీమ్ లోకి వచ్చేముందు అతడు తీవ్ర దుఃఖంలో ఉన్నాడు. అతడి తల్లి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇలాంటి పరిస్థితిలో ఆమెను వదిలి వచ్చాను అని చెప్పుకొచ్చాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ గెలిచిన తర్వాత రహ్మనుల్లా గుర్భాజ్ మాట్లాడుతూ..”ప్రస్తుతం మా అమ్మ ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఆమెతో నేను ప్రతి రోజు మాట్లాడుతూ ఉండేవాడిని. కానీ ఫిల్ సాల్ట్ కేకేఆర్ కు దూరమైన తర్వాత.. నా అవసరం ఇక్కడ ఉందని నాకు తెలుసు. అందుకే కేకేఆర్ ఫ్యామిలీ కోసం ఆఫ్గానిస్తాన్ నుంచి ఇక్కడి వచ్చాను. అయితే నేను ఇక్కడికి రావడం మా అమ్మకు, నాకు ఎంతో సంతోషం” అంటూ తాను ఏ పరిస్థితుల మధ్య జట్టులోకి వచ్చాడో వివరించాడు. ఇక ఈ విషయం తెలిసిన కేకేఆర్ ఫ్యాన్స్, క్రికెట్ లవర్స్.. గుర్భాజ్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అంటున్నారు. మరి కేకేఆర్, క్రికెట్ పై ప్రేమతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మ్యాచ్ ఆడటానికి వచ్చిన ఆఫ్గాన్ ప్లేయర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.