Somesekhar
SRH vs KKR మ్యాచ్ లో ఓ అద్భుతం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఆ వీడియోను చూసేయండి.
SRH vs KKR మ్యాచ్ లో ఓ అద్భుతం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఆ వీడియోను చూసేయండి.
Somesekhar
సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి.. దర్జాగా ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది కేకేఆర్. ఈ మ్యాచ్ లో SRH నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్ ను కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 13.4 ఓవర్లలోనే దంచి కొట్టింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(58*), వెంకటేశ్ అయ్యర్(51*) సూపర్ ఫిఫ్టీలతో రాణించారు. అయితే ఈ మ్యాచ్ లో అద్బుతం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? చూద్దాం పదండి.
కేకేఆర్ తో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. దాంతో SRH ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల విధ్వంస చూడ్డానికి రెడీగా ఉన్నారు ప్రేక్షకులు. అయితే వారి విధ్వంసం కేకేఆర్ బౌలర్ల ముందు పారలేదు. యార్కర్లకు పెట్టింది పేరు అయిన ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తొలి ఓవర్లోనే సన్ రైజర్స్ కు భారీ షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్ రెండో బంతికే కళ్లు చెదిరే యార్కర్ తో డేంజరస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్(0) ను బౌల్డ్ చేశాడు. ఈ యార్కర్ లో ఓ అద్భుతం ఉంది.
సాధారణంగా యార్కర్లు సంధిస్తే.. వికెట్లు విరగడం, గాల్లోకి ఎగిరి ఎంతో దూరంలో పడటం లాంటివి జరుగుతాయి. కానీ స్టార్క్ విసిరిన ఈ యార్కర్ కు వికెట్లపై ఉండే బెయిల్స్ గాల్లోకి ఓ పక్షిలా ఎగిరాయి. బ్యాటర్ సిక్సర్ కొడితే బాల్ గాల్లోకి ఎగిరినట్లు ఆ బెయిల్స్ ఎగిరిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బెయిల్స్ ఇలా ఎగిరిపడటం వీడియో తీయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ అతడు రాసుకొచ్చాడు. మరి ఆ వీడియోను మీరూ చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
That Starc to Head Yorker and i feel so Lucky that I could capture this and just see how High those bails Fly pic.twitter.com/bsYYk7vaws
— Archer (@poserarcher) May 22, 2024