iDreamPost
android-app
ios-app

SRH vs KKR మ్యాచ్.. హైదరాబాద్ ను భయపెడుతున్న KKR రికార్డ్స్!

ఐపీఎల్ 2024లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో కేకేఆర్-సన్ రైజర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్ రికార్డ్స్ SRH ఫ్యాన్స్ ను భయపెడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో కేకేఆర్-సన్ రైజర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్ రికార్డ్స్ SRH ఫ్యాన్స్ ను భయపెడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

SRH vs KKR మ్యాచ్.. హైదరాబాద్ ను భయపెడుతున్న KKR రికార్డ్స్!

ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం(మే 21)న అహ్మదాబాద్ వేదికగా తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో కేకేఆర్-సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ ఢీకొనబోతున్నాయి. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి, నేరుగా ఫైనల్లోకి దూసుకెళ్లాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఇందుకోసం తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ను కేకేఆర్ రికార్డ్స్ భయపెడుతున్నాయి. మరి SRHను భయపెడుతున్న ఆ రికార్డ్స్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

తుది దశకు వచ్చిన ఐపీఎల్ 2024లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో కేకేఆర్ ను ఢీకొనబోతోంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్. ముందుగా కేకేఆర్ గురించి చెప్పుకుంటే.. ఈ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచి డామినేషన్ ను కనబరిచింది కేకేఆర్ టీమ్. గౌతమ్ గంభీర్ మెంటరింగ్ లో టైటిల్ సాధించే దిశగా దూసుకెళ్తోంది. మరోవైపు సన్ రైజర్స్ టీమ్ కూడా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. తన చివరి లీగ్ మ్యాచ్ లో సైతం 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి తన సత్తా మరోసారి రుజువు చేసుకుంది.

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ కేకేఆర్ ప్లే ఆఫ్స్ రికార్డ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ను భయపెడుతున్నాయి. 17 ఏళ్ల ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో 8 విజయాలు, 5 ఓటములతో తనకంటూ ఓ రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ రికార్డే సన్ రైజర్స్ ను భయపెడుతోంది. నాకౌట్ మ్యాచ్ ల్లో కేకేఆర్ కు మంచి రికార్డ్ ఉండటంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. 2011లో తొలిసారి ప్లే ఆఫ్స్ చేరిన కేకేఆర్ టీమ్ ఆ తర్వాత ఏడాదే(2012) తొలి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2014లో కూడా టైటిల్ ను ఎగరేసుకుపోయింది కేకేఆర్. ఇక 2016, 17, 18 వరుస సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరుకుంది. 2021, ప్రస్తుతం ప్లే ఆఫ్స్ కు వచ్చి.. టైటిల్ రేసులో ముందుంది. మరి కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ లో ఏ టీమ్ విజయం సాధిస్తుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి