Nidhan
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ అలవోకగా ఓడించింది. మన టీమ్ బౌలింగ్, బ్యాటింగ్ బలం ముందు రుతురాజ్ సేన నిలవలేకపోయింది.
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ అలవోకగా ఓడించింది. మన టీమ్ బౌలింగ్, బ్యాటింగ్ బలం ముందు రుతురాజ్ సేన నిలవలేకపోయింది.
Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాజిక్ చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ అనగానే ఎస్ఆర్హెచ్ అభిమానులు టెన్షన్ పడ్డారు. సీఎస్కేను మన టీమ్ నిలువరించగలదా అని సందేహించారు. కానీ గత సీజన్ల కంటే ఎంతో డిఫరెంట్‌గా కనిపిస్తున్న సన్‌రైజర్స్.. రుతురాజ్ సేన మీద ఈజీగా నెగ్గింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై ఓవర్లన్నీ ఆడి 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అయితే సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఆఖర్లో వచ్చి ధనాధన్ షాట్లతో హైలైట్ అయ్యాడు ఓ తెలుగు ప్లేయర్. అతడే నితీష్ కుమార్ రెడ్డి.
షాబాజ్ అహ్మద్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన నితీష్ రెడ్డి విన్నింగ్ షాట్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. 8 బంతులు ఎదుర్కొన్న ఈ తెలుగోడు 14 పరుగులు చేశాడు. అందులో ఒక బౌండరీ, ఒక సిక్స్ ఉన్నాయి. ఈ రెండు షాట్లు కూడా సూపర్బ్ అనే చెప్పాలి. తొలుత రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఏమాత్రం బెరుకు లేకుండా రివర్స్ స్వీప్ ఆడాడు నితీష్. అది ఫీల్డర్లను ఛేదించుకొని బౌండరీకి దూసుకెళ్లింది. ఆ తర్వాత విజయానికి ఇంకో 6 పరుగులు అవసరం ఉందనగా.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో సిక్స్ బాదాడు నితీష్. ఇలా ఆఖర్లో వచ్చి బిగ్ షాట్స్‌తో అందరి ఫోకస్‌ను తన వైపునకు తిప్పుకున్నాడు. తక్కువ గ్యాప్‌లో ఎయిడెన్ మార్క్రమ్, షాబాజ్‌ను ఔట్ చేసిన సీఎస్కే.. మరో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌పై మరింత పట్టు బిగించాలని భావించింది.
నితీష్ చెన్నై ఆశలపై నీళ్లు చల్లాడు. రావడం రావడమే జడేజా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ కొట్టి తన ఉద్దేశం బాదుడేనని క్లియర్‌గా చెప్పేశాడు. విన్నింగ్ షాట్‌గా భారీ సిక్స్ కొట్టేసరికి సన్‌రైజర్స్ డగౌట్‌లోని ప్లేయర్లు పరిగెత్తుకుంటూ విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు. స్టేడియంలోని ఫ్యాన్స్ కూడా ఎస్ఆర్హెచ్ విజయంతో సంతోషంలో మునిగిపోయారు. ఇక, ఒకే ఇన్నింగ్స్‌తో మంచి క్రేజ్ సంపాదించిన నితీష్ రెడ్డి గురించి తెలుసుకునేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నంకు చెందిన నితీష్ ఆంధ్ర జట్టు తరఫున ఆడుతూ వెలుగులోకి వచ్చాడు. రంజీలతో పాటు విజయ్ మర్చంట్ ట్రోఫీలో దుమ్మురేపడంతో అతడ్ని టీమ్‌లోకి తీసుకుంది ఎస్ఆర్హెచ్. ఈ సీజన్‌కు ముందు జరిగిన మినీ ఆక్షన్‌లో రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కు సొంతం చేసుకుంది. కాగా, 17 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన నితీష్.. 566 పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్ అయిన అతడు 52 వికెట్లు పడగొట్టాడు. మరి.. నితీష్ రెడ్డి ఆటతీరుపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: Hardik Pandya: వీడియో: వరుస ఓటములు.. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పాండ్యా!
Nitish Kumar Reddy finishes in STYLE! 🥵pic.twitter.com/uyxaJcnddF
— ORANGE ARMY (@SUNRISERSU) April 5, 2024