Somesekhar
గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ శివమ్ దూబే మెరుపులు మెరిపించాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ శివమ్ దూబే మెరుపులు మెరిపించాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
Somesekhar
ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లు ఒకెత్తు అయితే.. తాజాగా చెన్నై-గుజరాత్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ మరో ఎత్తు. ఎందుకంటే? గత సీజన్ విన్నర్-రన్నర్ లు ఈ జట్లు. దీంతో ఈ పోరు కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారు ఎదురుచూసినట్లుగానే భారీ స్కోర్ నమోదు చేసింది తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్. మరీ ముఖ్యంగా గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబే. అతడి దంచికొట్టుడుకి గైక్వాడ్ టీమ్ 206 రన్స్ చేసింది.
శివమ్ దూబే.. తన అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు. బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్ లో 34 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ స్టార్ ప్లేయర్.. రెండో మ్యాచ్ లో మెరుపు అర్ధశతకంతో చెలరేగాడు. ప్రారంభం నుంచే గుజరాత్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వచ్చారు చెన్నై బ్యాటర్లు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(46), రచిన్ రవీంద్ర(46) జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. గుజరాత్ బౌలర్లపై దండయాత్ర చేశాడు దూబే. ఎడాపెడా సిక్సర్లు బాదుతూ.. గ్రౌండ్ ను మెుత్తం హోరెత్తించాడు.
ఈ క్రమంలోనే కేవలం 21 బంతుల్లోనే మెరుపు ఫిఫ్టీ సాధించాడు దూబే. ఓవరాల్ గా 23 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 51 రన్స్ చేసి 19వ ఓవర్లో వెనుదిరిగాడు. దూబే పెవిలియన్ చేరకపోయి ఉంటే.. స్కోర్ దూసుకెళ్లేదే. మిడిలార్డర్ లో తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వందకు రెండు వందల శాతం నిరూపించుకుంటూ వస్తున్నాడు ఈ చిచ్చరపిడుగు. దూబే ప్రత్యర్థి బౌలర్లపై శివతాండవం చేయడంతో.. చెన్నై టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. రషీద్ ఖాన్ 4 ఓవర్లకు 49 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మరి శివమ్ దూబే థండర్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
FIFTY BY SHIVAM DUBE…!!!!
A 21 ball half century by Dube – he’s been the backbone of CSK middle order since. Incredible impact. 💪 pic.twitter.com/ENThtjylCv
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 26, 2024
ఇదికూడా చదవండి: Rohit Sharma: ఫ్లయింగ్ కిస్ తో మయాంక్ ని టీజ్ చేసిన రోహిత్! ఇది వేరే లెవల్..