iDreamPost
android-app
ios-app

Rohit Sharma: వీడియో: ముంబై గెలిచినా రోహిత్ అన్ హ్యాపీ! ఎవ్వరూ గమనించని సీన్!

  • Published Apr 08, 2024 | 3:59 PM Updated Updated Apr 08, 2024 | 3:59 PM

ముంబై-ఢిల్లీ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సీన్ జరిగింది. బహుశా ఈ దృశ్యాన్ని ఎవ్వరూ గమనించి ఉండరు. ముంబై మ్యాచ్ గెలిచినా గానీ.. రోహిత్ శర్మ మాత్రం అన్ హ్యాపీగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముంబై-ఢిల్లీ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సీన్ జరిగింది. బహుశా ఈ దృశ్యాన్ని ఎవ్వరూ గమనించి ఉండరు. ముంబై మ్యాచ్ గెలిచినా గానీ.. రోహిత్ శర్మ మాత్రం అన్ హ్యాపీగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rohit Sharma: వీడియో: ముంబై గెలిచినా రోహిత్ అన్ హ్యాపీ! ఎవ్వరూ గమనించని సీన్!

ఈ ఐపీఎల్ సీజన్ లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 29 పరుగుల తేడాతో ఎంఐ టీమ్ అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ లో దుమ్మురేపిన ఆ జట్టు.. ఆ తర్వాత బౌలింగ్ లోనూ రాణించింది. తొలి విజయంతో ముంబై ప్లేయర్లందరూ సంతోషంలో మునిగిపోయారు. కానీ ఒక్క రోహిత్ శర్మ మాత్రం సంతోషంగా కనిపించలేదు. ముఖం మాడ్చుకుని కనిపించాడు రోహిత్. పాండ్యా దగ్గరికి వచ్చినా.. అన్ హ్యాపీగానే కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

హార్దిక్ పాండ్యా-రోహిత్ శర్మ మధ్య ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియడం లేదు. ఇద్దరి మధ్య కెప్టెన్సీ వివాదం ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్లుగా కనిపించడం లేదు. రోజులు గడిచిపోతున్నా.. మ్యాచ్ లు ముగిసిపోతున్నా పాండ్యా-రోహిత్ ల వైరం సమసిపోవడం లేదు. తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 29 రన్స్ తేడాతో అద్భుతమైన విజయం సాధించింది ముంబై. అయితే గెలిచిన అనంతరం ముంబై ఆటగాళ్లు, యజమానులు నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ సంబరాలు జరుపుకున్నారు.

ఇలా అందరూ తమ తొలి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటే.. రోహిత్ మాత్రం ముఖం మాడ్చుకున్నట్లుగా కనిపించింది. ప్లేయర్లందరూ సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకుంటూ ఉంటే.. రోహిత్ మాత్రం పాండ్యాను హగ్ చేసుకునే టైమ్ కి అన్ హ్యాపీగా కనిపించాడు. గెలిచామన్న సంతోషం అతడి ఫేస్ లో కనిపించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఇద్దరి మధ్య ఇంకా గొడవలు సద్దుమణిగినట్లు లేదు, ఎన్ని రోజులు ఇలా ఉంటారు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇంకో ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే? మ్యాచ్ విజయం తర్వాత రోహిత్, పాండ్యా చేసిన ట్విట్స్ చర్చనీయాంశంగా మారాయి. రోహిత్.. ముంబై ప్లేయర్ రొమారియో షెఫర్డ్ తో పాటుగా పిల్లలు, ప్రాక్టీస్ లో ఢిల్లీ ఆటగాళ్లతో సరదాగా ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో పాండ్యాతో పాటు ముంబై ప్లేయర్లకు చోటివ్వలేదు. కానీ హార్దిక్ షేర్ చేసిన దాంట్లో రోహిత్ తో పాటుగా ముంబై ప్లేయర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş