iDreamPost
android-app
ios-app

Rohit Sharma: మెున్న కోహ్లీ, నేడు రోహిత్ పై.. సెల్ఫిష్ అంటూ ట్రోల్స్! తిడుతున్నవారు ఇది తెలుసుకోవాలి!

  • Published Apr 15, 2024 | 8:30 AM Updated Updated Apr 15, 2024 | 8:30 AM

చెన్నైతో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ. అయినప్పటికీ అతడిని సెల్ఫిష్ అంటూ విమర్శిస్తున్నారు నెటిజన్లు. అయితే హిట్ మ్యాన్ ను ట్రోల్స్ చేసే వారు ఇవి తెలుసుకోవాలి. ఆ వివరాల్లోకి వెళితే..

చెన్నైతో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ. అయినప్పటికీ అతడిని సెల్ఫిష్ అంటూ విమర్శిస్తున్నారు నెటిజన్లు. అయితే హిట్ మ్యాన్ ను ట్రోల్స్ చేసే వారు ఇవి తెలుసుకోవాలి. ఆ వివరాల్లోకి వెళితే..

Rohit Sharma: మెున్న కోహ్లీ, నేడు రోహిత్ పై.. సెల్ఫిష్ అంటూ ట్రోల్స్! తిడుతున్నవారు ఇది తెలుసుకోవాలి!

ప్రేక్షకులు.. బాగా ఆడితే ఆకాశానికి ఎత్తేస్తారు. లేదంటే అధఃపాతాళానికి తొక్కేస్తారు. క్రీడా రంగంలోనే కాదు.. ఏ ఇండస్ట్రీలోనైనా ఇది కామన్. ఇక క్రికెట్ విషయానికి వస్తే.. ఎవరైనా ప్లేయర్ అద్భుతంగా ఆడితే.. అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తారు. అలా కాదని పూర్ ఫామ్ ను చూపిస్తే విమర్శల సునామీ సృష్టిస్తారు. అయితే ఈ రెండు కాకుండా పరిస్థితులకు తగ్గట్లుగా జట్టు విజయం కోసం పోరాడే క్రమంలో సైతం విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే. మెున్న విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా, సెల్ఫిష్ అంటూ విమర్శించారు. ఇప్పుడు హిట్ మ్యాన్ ను కూడా స్వార్థపరుడు అంటూ కొందరు నెటిజన్లు తిడుతున్నారు. అయితే రోహిత్ పై విమర్శలు, ట్రోల్స్ చేసేవారు ఇది తెలుసుకోవాలంటున్నారు మరికొందరు.

చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ నాక్ తో ఆకట్టుకున్నాడు. 207 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో 105 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అయితే టీమ్ ను గెలిపించకపోవడం బాధాకరం. అద్భుతమైన శతకం సాధించినప్పటికీ.. రోహిత్ ను స్వార్థపరుడు అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. హిట్ మ్యాన్ సెల్ఫిష్ అంటూ ఆ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే రోహిత్ శర్మను ట్రోల్స్ చేస్తున్నవారు ఇది తెలుసుకోవాలని అంటున్నారు ఫ్యాన్స్, మరికొంతమంది నెటిజన్లు. అదేంటంటే?

Selfish trolls! The should know this!

చెన్నైతో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 61 బంతుల్లో సెంచరీ చేశాడు. సూపర్ సెంచరీ సాధించినా కూడా హిట్ మ్యాన్ పై విమర్శలు రావడం ఆశ్చర్యకరమైన విషయం. కేవలం సెంచరీ చేయాలన్న స్వార్థం కోసమే నిదానంగా ఆడాడని ప్రధానంగా రోహిత్ పై వస్తున్న విమర్శ. ఈ క్రమంలోనే అతడి స్ట్రైక్ రేట్ ను కూడా సాకుగా చూపిస్తున్నారు కొందరు నెటిజన్లు. ఈ మ్యాచ్ లో 166 స్ట్రైక్ రేట్ తో రోహిత్ బ్యాటింగ్ చేశాడు. అయితే హిట్ మ్యాన్ ను తిడుతున్నవారు ఇక్కడ ఓ విషయం గమనించాలి. ఇషాన్ వికెట్ పడిన వెంటనే సూర్య కూడా ఔట్ కావడంతో.. ముంబైపై ఒత్తిడి ఎక్కువైంది. పైగా సాధించాల్సిన రన్ రేట్ కూడా పెరిగిపోయింది.

ఈ క్రమంలో పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాడు రోహిత్. ఓవైపు వికెట్లు పడుతుండటంతో.. భారీ షాట్స్ కు వెళ్లలేదు. అయితే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. అదీకాక ఇతర బ్యాటర్ల నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో.. రోహిత్ ఒంటరి పోరాటానికి ఫలితం రాకపోగా, స్వార్థపరుడు అంటూ విమర్శలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. అదీకాక అతడికి చివర్లో ఎక్కువగా స్ట్రైకింగ్ రాలేదు. ఇన్ని కారణాలు పెట్టుకుని రోహిత్ ను సెల్ఫిష్ అంటూ ఎలా నిందిస్తున్నారు? అంటూ ఫ్యాన్స్ తో పాటుగా మరికొంతమంది నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. కాగా.. మెున్న రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో సైతం సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీపై ఇలాగే సెల్ఫిష్ అంటూ విమర్శలు, ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ మ్యాచ్ లో రోహిత్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.