Rohit Sharma: ముంబై ఇండియన్స్ కి రోహిత్ గుడ్ బై! ఇంత రచ్చ జరుగుతుందా?

IPL 2024 సీజన్ కు సంబంధించి మరో హాట్ న్యూస్ వైరల్ గా మారింది. రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ గా తొలగించడంతో.. అతడు ముంబై జట్టును వీడుతున్నట్లు సమాచారం.

IPL 2024 సీజన్ కు సంబంధించి మరో హాట్ న్యూస్ వైరల్ గా మారింది. రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ గా తొలగించడంతో.. అతడు ముంబై జట్టును వీడుతున్నట్లు సమాచారం.

అనుకోని పరిణామాలు.. అనుకోని నిర్ణయాలకు దారితీస్తాయి. ఈ విషయం మనందరికి తెలిసిందే. ఇలాంటి పరిణామం కారణంగా.. ఐపీఎల్ 2024లో ఊహించని సంఘటన జరగబోతోందా? అంటే అవుననే అంటున్నాయి ఐపీఎల్ వర్గాలు, క్రికెట్ ఫ్యాన్స్, క్రీడా పండితులు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ ను తప్పించి.. పాండ్యాకు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హిట్ మ్యాన్ ను కావాలనే తప్పించారా? లేక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? అనే విషయాలు ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. ఈ క్రమంలోనే ఇంకో హార్ట్ బ్రేకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే? త్వరలోనే ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పబోతున్నాడనే వార్త.

ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పబోతున్నాడా? అంటే అవుననే సమాధానాలే అక్కడి క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎందుకంటే? స్థానం లేని చోట, విలువ లేని చోట నిలబడటం కంటే.. అక్కడి నుంచి గౌరవంగా వెళ్లిపోవడమే మంచిది. ప్రస్తుతం రోహిత్ శర్మ ఇదే బాటలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. దానికి కారణం మనందరికి తెలిసిందే. కెప్టెన్ గా తనను తొలగించడంపై రోహిత్ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఈ మౌనం వెనక అర్ధం ఏంటి? అన్న ప్రశ్న అందరిలో సందేహాలను రేకెత్తిస్తోంది. అదీకాక హిట్ మ్యాన్ ను పద్ధతి ప్రకారం తొలగించలేదని, యాజమాన్యం తమకు నచ్చినట్లు వ్యవహరించి.. అన్యాయంగా రోహిత్ ను తీసేసిందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ను సోషల్ మీడియాలో అన్ ఫాల్ చేస్తున్నారు కూడా.

ఈ క్రమంలోనే ఇంత అవమానం జరిగాక కూడా రోహిత్ ముంబై టీమ్ లోనే ఉంటాడు అనుకుంటే పొరపాటే. టీమ్ కు నాయకత్వం వహించిన చోట.. టీమ్ లో మెంబర్ గా చేయాలంటే ఎంతైనా కొద్దిగా బాధ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే రోహిత్ ముంబైకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ముంబై టీమ్ లో పెద్ద ఎత్తున చర్చలతో పాటుగా అంతర్గతంగా రచ్చ రచ్చ జరుగుతుందని టాక్. కాగా.. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో ఇటు అతడి ఫ్యాన్స్ ముంబై యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇన్ని సంక్లిష్ట పరిస్థితుల మధ్య రోహిత్ ముంబై టీమ్ లో ఉంటాడా? ఉండడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments