iDreamPost
android-app
ios-app

Virat Kohli: గుజరాత్ తో మ్యాచ్.. గిల్ తో కోహ్లీ గొడవ! వీడియో వైరల్..

  • Published Apr 29, 2024 | 12:58 PM Updated Updated Apr 29, 2024 | 12:58 PM

గుజరాత్ వర్సస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ లో జీటీ కెప్టెన్ శుబ్ మన్ గిల్ కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి మధ్య గొడవ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

గుజరాత్ వర్సస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ లో జీటీ కెప్టెన్ శుబ్ మన్ గిల్ కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి మధ్య గొడవ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

  • Published Apr 29, 2024 | 12:58 PMUpdated Apr 29, 2024 | 12:58 PM
Virat Kohli: గుజరాత్ తో మ్యాచ్.. గిల్ తో కోహ్లీ గొడవ! వీడియో వైరల్..

విరాట్ కోహ్లీ.. ఈ ఐపీఎల్ సీజన్ లో పరుగులు వరదపారిస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ ల్లో 500 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. ఇక తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచి.. టీమ్ కు అద్భుత విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ కు విరాట్ కోహ్లీకి మధ్య సరదా గొడవ జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో.. అంతకంటే ఎక్కువగా సరదాగా ఉంటాడు. స్టేడియంలో ప్లే అయ్యే సాంగ్స్ కు తనదైన స్టైల్లో స్టెప్పులు వేస్తూ అభిమానులు అలరిస్తూ ఉంటాడు. ఇక ఇతర జట్ల ఆటగాళ్లను టీజ్ చేయడంలో ఎప్పుడూ ముందుటాడు విరాట్. అయితే అది కామెడీగానే. ఇదిలా ఉండగా.. తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో సైతం తనలో ఉన్న కామెడీ యాంగిల్ ను బయటకి తీశాడు. గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ ను సరదాగా ఆటపట్టించాడు.

ఈ క్రమంలోనే గిల్ ను ఢీకొట్టి.. అతడిని ఏదో అన్నాడు. ఆ మాటలకు గిల్ నవ్వుతూ ఫీల్డింగ్ లో తన స్థానం వైపు వెళ్లాడు.  ఇదే కాక బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కూడా డగౌట్ లో కూర్చున్న గిల్ ను వదిలిపెట్టకుండా నవ్వుతూ టీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో.. అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.  విరాట్ భాయ్ కామెడీ టైమింగే వేరే లెవల్.. నీలో ఇంత హాస్యచతురతను ఎక్స్ పెక్ట్ చేయలేదు కింగ్ కోహ్లీ అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. మరి గిల్-విరాట్ మధ్య జరిగిన ఈ కామెడీ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş