Somesekhar
ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ పై సీరియస్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ పై సీరియస్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ వరుసగా 5 మ్యాచ్ ల్లో విజయం సాధించి.. ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదవ స్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీపై 47 రన్స్ తేడాతో గెలవడంతో, తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కాగా.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ పై సీరియస్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఓ రివ్యూ విషయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఎంత చురుగ్గా ఉంటాడో.. అంతే అగ్రెసివ్ గా ఉంటాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు కవ్విస్తే.. నిర్మొహమాటంగా ఢీ అంటే ఢీ అంటాడు. వారి యాక్షన్ కు స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తాడు. ఆ విషయం మనకు తెలియనిది కాదు. ఇక ఇదే క్రమంలో సొంత జట్టు ఆటగాళ్లపై కూడా అప్పుడప్పుడు కాస్త సీరియస్ అవుతుంటాడు ఈ రన్ మెషిన్. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో సొంత టీమ్ బౌలర్ అయిన మహ్మద్ సిరాజ్ పై అసహనం వ్యక్తం చేశాడు విరాట్ కోహ్లీ. దానికి రీజన్ ఏంటంటే?
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని సిరాజ్ యార్కర్ గా సంధించాడు. ఆ బాల్ ను అభిషేక్ పోరెల్ థర్డ్ మెన్ దిశగా బాదాడు. అయితే బంతి ప్యాడ్స్ కు తాకిందని భావించిన సిరాజ్ గట్టిగా ఎల్బీ అని అప్పీల్ చేశాడు. కానీ అంపైర్లు నాటౌట్ గా ప్రకటించారు. కానీ సిరాజ్ ఇతర ఆటగాళ్లు చెప్పింది వినకుండా రివ్యూ తీసుకోవాలని పట్టుబట్టాడు. దాంతో రివ్యూ కోరగా.. రిప్లేలో బంతి బ్యాట్ కు తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో విరాట్ కోహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్ సిరాజ్ పై అసహనం వ్యక్తం చేస్తూ కాస్త సీరియస్ అయ్యారు. మరి చెత్త రివ్యూ తీసుకుని కోహ్లీ కోపానికి గురైన సిరాజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Mohammad Siraj desperately wanted this review. pic.twitter.com/3Xm1T87vDm
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 12, 2024