Somesekhar
RCB vs DC మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఢిల్లీ సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ మధ్య ఓ రేర్ సీన్ చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
RCB vs DC మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఢిల్లీ సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ మధ్య ఓ రేర్ సీన్ చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Somesekhar
IPL 2024లో ఎవ్వరూ ఊహించని కంబ్యాక్ ఇచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. తొలి 8 మ్యాచ్ ల్లో ఒకే ఒక్క విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు వదులుకున్న టైమ్ లో.. సెకండాఫ్ లో అనూహ్యంగా చెలరేగిపోతోంది. వరుసగా 5 మ్యాచ్ ల్లో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో ఐదో ప్లేస్ లోకి దూసుకొచ్చింది. ఇక తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 47 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ-ఇషాంత్ శర్మ మధ్య జరిగిన రేర్ సీన్ ను మీరు చూశారా? అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
విరాట్ కోహ్లీ.. గ్రౌండ్ లో ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో మనందరికి తెలిసిందే. ఇక ఫీల్డింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు కవ్విస్తే.. అంతకు పదిరెట్లతో వారికి కౌంటర్లు ఇస్తుంటాడు రన్ మెషిన్. ఈ విషయం మనం ఎన్నో మ్యాచ్ ల్లో చూశాం కూడా. కాగా.. తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో విరాట్ నిరాశపరిచాడు. 13 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సులతో 27 పరుగులు చేసి మంచి ఊపులో కనిపించాడు. కానీ దాన్ని భారీ స్కోర్ గా మలచడంలో విఫలమైయ్యాడు. ఎదురుదాడికి దిగుతున్న విరాట్ ను ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఔట్ చేశాడు సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ. కీపర్ పోరెల్ కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవిలియన్ చేరాడు.
అయితే ఔటై గౌండ్ ను వీడుతున్న కోహ్లీని సరదాగా టీజ్ చేశాడు ఇషాంత్. కోహ్లీ దగ్గరికి వెళ్లి మరీ అతడిని నవ్వుతూ ఢీ కొట్టాడు. నిరాశలో ఉన్న విరాట్ ఇషాంత్ ను ఏమీ అనలేదు. అయితే ఆ తర్వాత ఇషాన్ బ్యాటింగ్ కు వచ్చినప్పుడు కోహ్లీ అతడిని ఆటపట్టించాడు. ఇషాంత్ బ్యాటింగ్ చేస్తుంటే.. పగలబడి నవ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. విరాట్-ఇషాంత్ మధ్య బాండింగ్ కు ఇది నిదర్శనం అని, మంచి ఫ్రెండ్స్ కు ఎప్పుడూ శత్రువులు కారు అంటూ వారి బాండింగ్ పై కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 140 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. మరి విరాట్ ను ఇషాంత్ సరదాగా టీజ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.