Somesekhar
ఒకవైపు ఓటమి బాధ, మరోవైపు వివాదాస్పదమైన ఔట్ తో నిరాశలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఒకవైపు ఓటమి బాధ, మరోవైపు వివాదాస్పదమైన ఔట్ తో నిరాశలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
ఈ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపుతూ దూసుకెళ్తున్న రాజస్తాన్ రాయల్స్ కు ఊహించని షాకిచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్. నిన్న(మంగళవారం) జరిగిన మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో రాజస్తాన్ ను ఓడించింది ఢిల్లీ. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ లో రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ 86 పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ.. జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్ లో అతడి ఔట్ పై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజూకు ఊహించని షాక్ తగిలింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఢిల్లీతో గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి, దానికి తోడు అంపైర్ల తప్పుడు నిర్ణయం వల్ల బలైన బాధలో ఉన్నాడు సంజూ శాంసన్. ఈ క్రమంలోనే మరో ఊహించని షాక్ తగిలింది శాంసన్ కు. తన ఔట్ పై అంపైర్లతో వాదనకు దిగినందుకు క్రమశిక్షణా చర్యల్లో భాగంగా శాంసన్ కు మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించారు నిర్వాహకులు. తన క్యాచ్ పట్టే క్రమంలో ఢిల్లీ ఫీల్డర్ షై హోప్ కాలు బౌండరీ లైన్ కు తాకినట్లు రిప్లేలో స్పష్టంగా కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం శాంసన్ ను ఔట్ గా ప్రకటించాడు. దీంతో సహనం కోల్పోయిన సంజూ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఇది టోర్నీ నిబంధనలకు విరుద్దం కావడంతో.. అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు ఐపీఎల్ నిర్వాహకులు. దీంతో ఇప్పటికే ఓటమి బాధ, తప్పుడు ఔట్ తో బాధలో ఉన్న సంజూ శాంసన్ కు ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. మరి శాంసన్ కు మ్యాచ్ ఫీజులో కోత విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sanju Samson has been fined 30% of his match fees for showing dissent on umpire’s decision. pic.twitter.com/NL39Rr6Hra
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 8, 2024