iDreamPost
android-app
ios-app

IPL 2024: పృథ్వీ షా.. ఇక ఐపీఎల్‌లో కూడా కనిపించడా?

  • Published Mar 23, 2024 | 4:42 PM Updated Updated Mar 23, 2024 | 4:42 PM

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ పృథ్వీ షా ఈసారి ఐపీఎల్​లో అదరగొడతాడని అంతా ఎదురు చూస్తున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అతడు ఇక లీగ్​లో కనిపించడం కష్టంగానే ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ పృథ్వీ షా ఈసారి ఐపీఎల్​లో అదరగొడతాడని అంతా ఎదురు చూస్తున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అతడు ఇక లీగ్​లో కనిపించడం కష్టంగానే ఉంది.

  • Published Mar 23, 2024 | 4:42 PMUpdated Mar 23, 2024 | 4:42 PM
IPL 2024: పృథ్వీ షా.. ఇక ఐపీఎల్‌లో కూడా కనిపించడా?

ఈసారి ఐపీఎల్​లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సూపర్ స్టార్లతో పాటు పలువురు యంగ్ క్రికెటర్ల ఆటను చూసేందుకు కూడా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అందులోనూ టీమిండియాకు ఎంపికై పలు మ్యాచులు ఆడి.. మళ్లీ కనిపించకుండా పోయిన పృథ్వీ షా వంటి బ్యాటర్ల గేమ్​ను చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. ఎంతో టాలెంటెడ్ ప్లేయర్ అయిన షా ఈసారి ఢిల్లీ తరఫున అదరగొట్టి తిరిగి భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని అతడి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. అతడు ఐపీఎల్​లో ఇక కనిపించకపోవచ్చు.  ఈ నేపథ్యంలో అసలు షాకు ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్​లో పృథ్వీ షా కనిపించడం కష్టంగానే ఉంది. నయా సీజన్​లోని ఆరంభ మ్యాచ్​లో పంజాబ్ కింగ్స్​తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది . అయితే మ్యాచ్​కు ముందు డీసీ ప్రకటించిన ప్లేయింగ్ ఎలెవన్​లో షా పేరు లేదు. డొమెస్టిక్ క్రికెట్​లో ఫర్వాలేదనిపిస్తున్న అతడు.. ఐపీఎల్​తో టచ్​లోకి వద్దామని అనుకున్నాడు. కానీ ఢిల్లీ ఫ్రాంచైజీ మాత్రం మొదటి మ్యాచ్​లో మొండిచెయ్యి చూపించింది. సూపర్ ఫామ్​లో ఉన్న మిచెల్ మార్ష్​తో పాటు వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్​ను ఓపెనర్లుగా సెలక్ట్ చేసింది. టీమ్ నమ్మకాన్ని నిలబెడుతూ వార్నర్-మార్ష్​ జోడీ సూపర్బ్ స్టార్ట్ అందించింది. 3.2 ఓవర్లలోనే 39 పరుగులు జోడించింది.

Shah

అటు షా ఫామ్​లో లేడు, ఇటు వార్నర్-మార్ష్​ జోడీ సూపర్ టచ్​లో కనిపిస్తున్నారు. దీంతో ఈ సీజన్​లో షా పూర్తిగా బెంచ్​కే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేరే స్లాట్​లో ఆడిద్దామన్నా ఎక్కడా ఛాన్స్ కనిపించడం లేదు. వార్నర్, మార్ష్​లు ఫెయిలైతే తప్ప షాకు ఛాన్స్ దొరికడం కష్టంగానే ఉంది. దీంతో అతడి ఐపీఎల్ కెరీర్ కూడా క్లోజ్ అని.. ఇక వెళ్లి డొమెస్టిక్ క్రికెట్ ఆడుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. దేశవాళీల్లో రాణిస్తే తప్ప షా మళ్లీ కమ్​బ్యాక్ ఇవ్వలేడని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. షాకు ఛాన్స్ రాకపోవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: CSK ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. IPL 2024 నుంచి ధోని ఔట్? వైరలవుతున్న దిగ్గజ ప్లేయర్ మాటలు

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet