iDreamPost
android-app
ios-app

లక్నోపై ఢిల్లీ విజయంతో మరింత రసవత్తరంగా ప్లే ఆఫ్స్‌ రేసు! RCBకి గోల్డెన్‌ ఛాన్స్‌

  • Published May 15, 2024 | 9:02 AM Updated Updated May 15, 2024 | 9:02 AM

IPL 2024, Playoffs, RCB vs CSK: ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీమ్స్‌పై నెలకొన్నంత ఆసక్తి, ఉత్కంఠ మరే సీజన్‌లోనూ లేదనిపిస్తోంది. ఆ రేంజ్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే రెండు టీమ్స్‌ క్వాలిఫై కాగా.. మరో రెండు టీమ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం..

IPL 2024, Playoffs, RCB vs CSK: ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీమ్స్‌పై నెలకొన్నంత ఆసక్తి, ఉత్కంఠ మరే సీజన్‌లోనూ లేదనిపిస్తోంది. ఆ రేంజ్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే రెండు టీమ్స్‌ క్వాలిఫై కాగా.. మరో రెండు టీమ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం..

  • Published May 15, 2024 | 9:02 AMUpdated May 15, 2024 | 9:02 AM
లక్నోపై ఢిల్లీ విజయంతో మరింత రసవత్తరంగా ప్లే ఆఫ్స్‌ రేసు! RCBకి గోల్డెన్‌ ఛాన్స్‌

ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఊహకు అందని రేంజ్‌లో జరుగుతోంది. 60కి పైగా మ్యాచ్‌లు ముగిసిపోయినా.. టోర్నీ ముగింపు దశకు చేరినా.. ఇంకా ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీమ్స్‌పై అంతే ఆసక్తి, అంతే ఉత్కంఠ నెలకొంది. అయితే.. మంగళవారం ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ క్రికెట్‌ స్టేడియంలో లక్నో సూపర్‌ జెయింట్ల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌తో కాస్త క్లారిటీ వచ్చినా.. ఓ రెండు స్థానాలపై మాత్రం తీవ్రం ఉత్కంఠ నెలకొంది. లక్నోపై ఢిల్లీ గెలవడంతో.. 16 పాయింట్లతో ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిపోయింది. ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్న ఏ జట్టుకు కూడా 16 పాయింట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో ఆర్‌ఆర్‌ క్వాలిఫై అయింది.

ఇక మూడు నాలుగు స్థానాల కోసం.. ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. ఈ ఐదు టీమ్స్‌లో ఇప్పటికే ఎస్‌ఆర్‌హెచ్‌, సీఎస్‌కే ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ఎస్‌ఆర్‌హెచ్‌కు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో ఒక్క మ్యాచ్‌ గెలిచినా.. ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిపోయింది. ఇప్పుడు అసలు పోటీ నాలుగో స్థానం కోసమే. ఈ స్థానం కోసం నాలుగు టీమ్స్‌ పోటీ పడుతున్నాయి. నాలుగు టీమ్స్‌లో ఇప్పటికే ఢిల్లీ పూర్తి కోటా 14 మ్యాచ్‌లు ఆడేసింది. ప్రస్తుతం ఆ టీమ్‌ ఐదో స్థానంలో ఉంది.

ఒక రకంగా చెప్పాలంటే.. ప్రస్తుతం ప్లే ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్సులు ఆర్సీబీకే ఎక్కువ ఉన్నాయి. తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించిన ఆర్సీబీ.. తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్స్‌ రేసులోకి దూసుకొచ్చింది. ఈ నెల 18న సీఎస్‌కేతో ఆర్సీబీ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 18 పరుగులు లేదా అంత కంటే ఎక్కువ తేడాతో, లేదా టార్గెట్‌ను 18 ఓవర్ల లోపల ఛేజ్‌ చేస్తే ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. ఇప్పుడు ఆ టీమ్‌ ఉన్న ఫామ్‌ను బట్టి, అలాగే మ్యాచ్‌ సొంత మైదానం జరుగుతుండటంతో ఆర్సీబీనే హాట్‌ ఫేవరేట్‌గా ఉంది. కానీ, ఆ రోజు వర్షం వచ్చే సూచనలు ఉండటంతో ఆర్సీబీని కలవరపెడుతోంది. వర్షంతో మ్యాచ్‌ రద్దు అయితే.. సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌ క్వాలిఫై అవుతుంది. ఫైనల్‌.. ఇప్పటికే కేకేఆర్‌, రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిపోగా.. మిగిలిన రెండు స్థానాల్లో ఎస్‌ఆర్‌హెచ్‌, ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. మరి ఏ నాలుగు టీమ్స్‌ ప్లే ఆఫ్స్‌కు వెళ్తాయని మీరు భావిస్తున్నారు. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.