iDreamPost

IPL 2024: ఐపీఎల్​లో మరో కొత్త రూల్.. ఇక బ్యాటర్లకు మూడినట్లే..!

  • Published Dec 19, 2023 | 8:16 AMUpdated Dec 19, 2023 | 8:16 AM

ఆధునిక క్రికెట్​లో బ్యాటర్లదే పెత్తనం నడుస్తోంది. ఫార్మాట్ ఏదైనా వాళ్లదే డామినేషన్ అని చెప్పాలి. కానీ దీనికి చెక్ పెట్టేందుకు.. బాల్​కు, బ్యాట్​కు మధ్య టఫ్ కాంపిటీషన్ నడవాలనే ఉద్దేశంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో సరికొత్త రూల్ తీసుకొస్తున్నారు.

ఆధునిక క్రికెట్​లో బ్యాటర్లదే పెత్తనం నడుస్తోంది. ఫార్మాట్ ఏదైనా వాళ్లదే డామినేషన్ అని చెప్పాలి. కానీ దీనికి చెక్ పెట్టేందుకు.. బాల్​కు, బ్యాట్​కు మధ్య టఫ్ కాంపిటీషన్ నడవాలనే ఉద్దేశంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో సరికొత్త రూల్ తీసుకొస్తున్నారు.

  • Published Dec 19, 2023 | 8:16 AMUpdated Dec 19, 2023 | 8:16 AM
IPL 2024: ఐపీఎల్​లో మరో కొత్త రూల్.. ఇక బ్యాటర్లకు మూడినట్లే..!

ప్రస్తుతం క్రికెట్​ అంటే బ్యాట్స్​మెన్ గేమ్​గా మారిన సంగతి తెలిసిందే. టెస్ట్ మ్యాచ్​లు తప్పితే వన్డే, టీ20 ఫార్మాట్లలో మొత్తం ఫ్లాట్​ పిచ్​లే తయారు చేస్తున్నారు. పిచ్ నుంచి బౌలర్లకు ఏమాత్రం సాయం అందకపోవడం, అధునాతన బ్యాట్లు మార్కెట్​లోకి రావడంతో స్వీట్ స్పాట్​లో బాల్ తగిలితే చాలు బౌండరీ గ్యారెంటీ అనేలా పరిస్థితులు తయారయ్యాయి. ఆడియెన్స్​ను టీవీలు, ఫోన్లలో మ్యాచులు చూసేలా ఎంగేజ్ చేయాలన్నా.. స్టేడియాలకు రప్పించాలన్నా భారీ స్కోర్లు కావాలనే టెంప్లేట్​ను ఫాలో అవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. కానీ టెస్టుల్లో మాత్రం స్పిన్నర్లు, పేసర్లకు మద్దతు దొరికేలా పిచ్​లను రూపొందిస్తుండటంతో అక్కడ బ్యాట్, బాల్​కు మధ్య గట్టి పోటీ ఉంటోంది. అయితే ఇక మీద ఐపీఎల్​లోనూ బ్యాటర్లు, బౌలర్ల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉండబోతోంది. రిచ్ క్యాష్ లీగ్​లో ఓ కొత్త రూల్ తీసుకొస్తుండటమే దీనికి కారణం.

ఐపీఎల్-2024లో కొత్త నిబంధన తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మీదట ప్రతి ఓవర్​లో బౌలర్లు రెండు బౌన్సర్లు వేసే వేసేందుకు అవకాశం కల్పించనున్నారట. బ్యాట్, బాల్ మధ్య టఫ్ ఫైట్ నడవాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త రూల్​కు లీగ్ నిర్వాహకులు శ్రీకారం చుట్టారట. ఇటీవల జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీ 2023-24లో ఈ రెండు బౌన్సర్ల రూల్ మీద ప్రయోగం జరిగింది. అక్కడ సక్సెస్ కావడంతో ఐపీఎల్​లోనూ దీన్ని అప్లై చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారని సమాచారం. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఐపీఎల్​లో రెండు బౌన్సర్ల రూల్ తీసుకొస్తున్నారనే వార్తలపై టీమిండియా పేసర్ జయ్​దేవ్ ఉనాద్కట్ రియాక్ట్ అయ్యాడు. ఒకే ఓవర్​లో రెండు బౌన్సర్లు వేసే ఛాన్స్ ఉండటం పేస్ బౌలర్లకు చాలా ఉపయోగపడుతుందన్నాడు. బ్యాటర్లపై ఆధిపత్యం చెలాయించేందుకు ఇదో మంచి అవకాశం అన్నాడు ఉనాద్కట్. రెండు బౌన్సర్ల రూల్ ఐపీఎల్​లో చాలా మార్పులు తీసుకొస్తుందన్నాడు. ఇది బౌలర్లకు స్ట్రాంగ్ వెపన్​లా మారుతుందన్నాడు ఉనాద్కట్.

new rules in ipl 2023

ఇక, గతేడాది ఐపీఎల్​లో ప్రవేశపెట్టిన ఇంపార్ట్ ప్లేయర్ రూల్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ సీజన్​లో ఈ నిబంధనను కంటిన్యూ చేస్తారట. అయితే ఈ రూల్ కింద ప్లేయింగ్ ఎలెవన్​లో టాస్​కు ముందే నలుగురు సబ్​స్టిట్యూట్​లను ఉంచాలని తెలుస్తోంది. అందులో నుంచి ఎవరో ఒకర్ని ఇంపాక్ట్ ప్లేయర్​గా వాడుకోవచ్చట. ఒకవేళ స్టార్టింగ్ ఎలెవన్​లో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్​గా ఇండియన్ ప్లేయర్​ను మాత్రమే దింపాల్సి ఉంటుందని సమాచారం. ఏదేమైనా కొత్త రూల్స్ తీసుకొస్తూ గేమ్​ను మరింత ఇంట్రెస్టింగ్​గా మార్చేందుకు ప్రయత్నిస్తుండటాన్ని మెచ్చుకోవాల్సిందే. అయితే రెండు బౌన్సర్ల నిబంధన బ్యాటర్లకు తలనొప్పిగా మారుతుందని, ముఖ్యంగా బౌన్సర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడేవారికి సమస్యలు తప్పవని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. మరి.. ఐపీఎల్​లో రెండు బౌన్సర్ల రూల్​ను తీసుకొస్తే బ్యాటర్లకు ఇబ్బంది తప్పదా? ఈ నిబంధనపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Sachin Tendulkar: కన్నీళ్లు పెట్టిస్తున్న సచిన్ పోస్ట్.. ఆయన్ను తలచుకొని క్రికెట్ గాడ్ ఎమోషనల్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి