Somesekhar
KKRతో జరిగే కీలక మ్యాచ్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు డబుల్ గుడ్ న్యూస్ అందింది. మరి ఆ శుభవార్త ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..
KKRతో జరిగే కీలక మ్యాచ్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు డబుల్ గుడ్ న్యూస్ అందింది. మరి ఆ శుభవార్త ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
IPL 2024 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ నిలకడగా రాణిస్తోంది. తొలి రెండు మ్యాచ్ ల్లో విజయాలు సాధించి టోర్నీని ఘనంగా ఆరంభించిన చెన్నై.. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది. ఇక తన నెక్ట్స్ మ్యాచ్ పటిష్టమైన కోల్ కత్తా నైట్ రైడర్స్ తో ఆడనుంది. ఈ కీలక మ్యాచ్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు డబుల్ గుడ్ న్యూస్ అందింది. మరి ఆ శుభవార్త ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
ఈ సీజన్ లో మరో సరవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ను ఢీ కొనబోతోంది పటిష్ట కోల్ కత్తా. ఈ మ్యాచ్ కు ముందు చెన్నైకి సూపర్ గుడ్ న్యూస్ అందింది. వివిధ కారణాల చేత సన్ రైజర్స్ తో మ్యాచ్ కు దూరంగా ఉన్న స్టార్ పేసర్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీష పతిరణ కేకేఆర్ తో మ్యాచ్ కు అందుబాటులోకి రానున్నారు. ఈ విషయాన్ని చెన్నై బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ తెలిపినట్లు సమాచారం. గాయం కారణంగా గత మ్యాచ్ కు దూరమైన పతిరణ.. పూర్తి ఫిట్ నెస్ సాధించాడని తెలుస్తోంది. ఇక టీ20 వరల్డ్ కప్ వీసా పనిపై బంగ్లాదేశ్ వెళ్లిన ముస్తాఫిజుర్ తిరిగి చెన్నైకి బయలుదేరిట్లు తెలుస్తోంది.
వీరిద్దరి రాకతో సీఎస్కే బౌలింగ్ దళం బలంగా మారబోతోంది. ముస్తాఫిజుర్, పతిరణ గత మ్యాచ్ కు అందుబాటులో లేని లోటు స్పష్టంగా కనిపించింది. చెన్నై బౌలింగ్ విభాగం పూర్తిగా తేలిపోయింది. ఇక వీరి రాకతో జట్టు సమతూల్యంగా కనిపిస్తోంది. ఈ సీజన్ లో 3 మ్యాచ్ లు ఆడిన ముస్తాఫిజుర్ 7 వికెట్లు తీయగా.. పతిరణ 2 మ్యాచ్ ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. కేకేఆర్ లాంటి బలమైన టీమ్ ను ఎదుర్కొనే ముందు వీరు జట్టులోకి రావడం చెన్నైకి కలిసొచ్చే అంశం. కాగా.. కేకేఆర్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో మూడు విజయాలతో సీజన్ లో అదరగొడుతోంది. తమ చివరి మ్యాచ్ లో ఢిల్లీని ఓడించింది. ఇక చెన్నై మాత్రం సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయింది. మరి ఈ సమవుజ్జీల సమరంలో ఏ జట్టు విజయం సాధిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
In today’s IPL match, Mustafizur and Pathirana are probably going to take on KKR. {Sportstar]
Fantastic news for CSK… pic.twitter.com/BUknp9HODT
— GS SPORTS (@Gssports25) April 8, 2024