Nidhan
పాత కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త సారథి హార్దిక్ పాండ్యా వార్ నేపథ్యంలో ఈసారి ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడం కష్టమేనని అంతా అంటున్నారు. కానీ ఈ సెంటిమెంట్ రిపీటైతే కప్పు నెగ్గకుండా ఎంఐని ఎవ్వరూ ఆపలేరు.
పాత కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త సారథి హార్దిక్ పాండ్యా వార్ నేపథ్యంలో ఈసారి ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడం కష్టమేనని అంతా అంటున్నారు. కానీ ఈ సెంటిమెంట్ రిపీటైతే కప్పు నెగ్గకుండా ఎంఐని ఎవ్వరూ ఆపలేరు.
Nidhan
ఐపీఎల్-2024లో మిగతా అన్ని జట్ల కంటే ముంబై ఇండియన్స్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంది. జట్టుకు 5 కప్పులు అందించిన రోహిత్ శర్మను తీసేసి హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి కెప్టెన్ చేయడమే దీనికి రీజన్. కెప్టెన్సీ మార్పు నేపథ్యంలో ఎంఐ ఎలా ఆడుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బౌలింగ్, బ్యాటింగ్‌లో టీమ్‌లో బ్యాలెన్స్ తీసుకొస్తూ బాగా సెట్ చేశాడు హిట్‌మ్యాన్. ఆ టీమ్‌ను హార్దిక్ ఎలా ముందుకు నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రాక్టీస్ సెషన్స్‌లో రోహిత్-హార్దిక్ మధ్య సఖ్యత ఉన్నట్లు కనిపించడం లేదు. వీళ్లిద్దరి మధ్య పెద్దగా మాటలు లేవు. హార్దిక్ అండ్ కోకు రోహిత్ దూరంగా ఉంటున్నాడు. దీంతో ఈసారి ముంబై మ్యాజిక్ చేయడం కష్టమేనని అంతా భావిస్తున్నారు. కానీ ఓ సెంటిమెంట్ మాత్రం ఆ టీమ్‌కు కొండంత బలాన్ని ఇస్తోంది.
ఐపీఎల్ నయా సీజన్లో సీఎస్కే, ఆర్సీబీ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇలా గతంలో ఒకసారి టోర్నీలోని ఫస్ట్ మ్యాచ్ చెన్నై, బెంగళూరు మధ్య జరిగింది. ఆ ఏడాది ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి కూడా సీఎస్కే, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్‌తో సీజన్ స్టార్ట్ కానుంది. దీంతో ఈ సెంటిమెంట్ రిపీట్ అవ్వాలని హార్దిక్ సేన కోరుకుంటోంది. ఒకవేళ సెంటిమెంట్ పునరావృతమైతే ఆరో కప్పును కైవసం చేసుకోవడం పక్కా అని చెబుతోంది. ఈ సెంటిమెంట్ గురించి తెలిసిన ఆ టీమ్ ఫ్యాన్స్.. రాసిపెట్టుకోండి, ఎంఐదే కప్పు అని అంటున్నారు. రోహిత్-హార్దిక్ మధ్య వార్ నడుస్తున్నప్పటికీ వాళ్లిద్దరూ కలసి అదరగొడతారని.. ముంబైని ఆపడం ఎవరి తరం కాదంటున్నారు.
ముంబైదే కప్పు అని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. కెప్టెన్సీ భారం పోయింది కాబట్టి రోహిత్ మరింత స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపిస్తాడని.. అతడ్ని ఆపడం ఎవరి వల్లా కాదని కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ సారథ్య పగ్గాలు తీసుకుంటున్నాడు కాబట్టి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడని అంటున్నారు. టైటిల్ నెగ్గి చాలా ఏళ్లు అయింది కాబట్టి ఈసారి అందరూ కసి మీద ఉన్నారని.. ముంబైని ఓడించడం చాలా కష్టమని చెబుతున్నారు. ఇక, ఈ టోర్నీలోని తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది హార్దిక్ సేన. ఈ మ్యాచ్ మార్చి 24వ తేదీన జరగనుంది. మరి.. సీఎస్కే, ఆర్సీబీ సెంటిమెంట్ వర్కౌటై ముంబై కప్పు ఎగరేసుకుపోతుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
Mumbai Indians won the IPL when CSK faced RCB in the first match of IPL during the last time. pic.twitter.com/ksaNxP4vNu
— Johns. (@CricCrazyJohns) March 22, 2024