Somesekhar
103 ఏళ్ల చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమానికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు మహేంద్రసింగ్ ధోని. ఆ బహుమతికి తాత సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
103 ఏళ్ల చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమానికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు మహేంద్రసింగ్ ధోని. ఆ బహుమతికి తాత సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండటం అనేది గొప్ప వారి లక్షణం. అయితే అది అందరికీ రాదు, ఉండదు. ఇలాంటి గొప్ప లక్షణాలు ఉన్న వారిలో టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ఒకడు. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండటంలో ధోని ముందువరుసలో ఉంటాడు. తన ఆటతీరుతో వరల్డ్ వైడ్ గా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా గానీ మూలాలను మాత్రం మహేంద్రుడు మర్చిపోడు. కోట్లలో ఆస్తులున్నా, అంతకంటే ఎక్కువ అభిమానులు ఉన్నా.. ఎంతో సింప్లి సిటీతో అందరికి ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా ధోని చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు.
మహేంద్రసింగ్ ధోని.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ధనాధన్ బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. ఇక తాజాగా తలా చేసిన ఓ పని అభిమానులు సంతోషానికి గురిచేస్తోంది. అసలేం జరిగిందంటే? 103 ఏళ్ల రాందాస్ కు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అంటే విపరీతమైన పిచ్చి. ఐపీఎల్ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఆ టీమ్ కు సపోర్ట్ చేస్తూ.. తన అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఆ 103 ఏళ్ల సీఎస్కే వీరాభిమాని ఇంటికి స్వయంగా వెళ్లాడు ధోని. దీంతో ఈ సంఘటనను ఊహించిన ఆ ఓల్డ్ మ్యాన్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇన్ని సంవత్సరాలుగా చెన్నై టీమ్ కు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పి.. సీఎస్కే జెర్సీపై తన ఆటోగ్రాఫ్ పెట్టి బహుమతిగా అందజేశాడు ధోని. ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాడంతో.. ధోని సింప్లిసిటీకి అభిమానుల ఫిదా అవుతున్నారు. ధోని భాయ్ అభిమానుల మనసు మరోసారి గెలుచుకున్నారు అంటూ కితాబిస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా.. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 10 మ్యాచ్ ల్లో 5 విజయాలు 5 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదవ ప్లేస్ లో కొనసాగుతోంది. మరి ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండే ధోని మనస్తత్వంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
MS Dhoni gifted a signed CSK Jersey to 103-year-old CSK fan..!!👌👌#IPL2024 #SRHvRR #RRvsSRH #Natarajan #T20WorldCup24 #FridayVibes #gntm #TimnasDay #RahulGandhi pic.twitter.com/BN2R21yYMq
— jeetu maher (@Jeetu8290) May 3, 2024