Somesekhar
IPL చరిత్రలోనే ఓ క్రేజీ రికార్డును తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీడీలు సైతం ఈ ఘనతలో రాహుల్ వెనకే ఉన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
IPL చరిత్రలోనే ఓ క్రేజీ రికార్డును తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీడీలు సైతం ఈ ఘనతలో రాహుల్ వెనకే ఉన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
IPL 2024 సీజన్ లో అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సూపర్ నాక్ తో అదరగొట్టాడు. దీంతో లక్నో భారీ స్కోర్ సాధించింది. ఇక ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే ఓ క్రేజీ రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్. దీంతో అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..
ఈ ఐపీఎల్ సీజన్ లో భాగంగా శనివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్. 11 రన్స్ కే 2 వికెట్లు కోల్పోయి దశలో దీపక్ హుడా(50)తో కలిసి రెండో వికెట్ కు 115 పరుగుల భారీ పార్ట్ నర్ షిప్ ను నెలకొల్పాడు. ఈ క్రమంలోనే 48 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు చేసిన రాహుల్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ ద్వారా ఓ క్రేజీ రికార్డుకు నెలకొల్పాడు రాహుల్. అదేంటంటే? ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 4 వేల పరుగులను పూర్తి చేసుకున్న ప్లేయర్ గా ఘనత వహించాడు లక్నో కెప్టెన్.
కాగా.. ఈ క్రేజీ రికార్డ్ సాధించడానికి రాహుల్ 105 ఇన్నింగ్స్ లు తీసుకున్నాడు. ఇక ఈ జాబితాలో సెకండ్ ప్లేస్ లో క్రిస్ గేల్(112 ఇన్నింగ్స్), డేవిడ్ వార్నర్(114), విరాట్ కోహ్లీ(128), ఏబీడీ (131) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. మరి ఏకంగా క్రిస్ గేల్ రికార్డ్ నే బద్దలు కొడుతూ.. సరికొత్త చరిత్ర సృష్టించిన కేెఎల్ రాహుల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
KL 🟰 Class. 😍
pic.twitter.com/ynco3LGuCx— Mufaddal Vohra (@mufaddal_vohra) April 27, 2024
KL Rahul becomes the fastest opener in IPL history to score 4000 runs. 🫡🔥 pic.twitter.com/pserL8szzx
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 27, 2024