iDreamPost
android-app
ios-app

RCB vs LSG: వీడియో: పూరన్ భారీ సిక్సర్.. కొడితే స్టేడియం బయట పడింది!

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిపించాడు లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్. ఈ క్రమంలోనే ఈ సీజన్ లో లాంగెస్ట్ సిక్స్ ను నమోదు చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిపించాడు లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్. ఈ క్రమంలోనే ఈ సీజన్ లో లాంగెస్ట్ సిక్స్ ను నమోదు చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

RCB vs LSG: వీడియో: పూరన్ భారీ సిక్సర్.. కొడితే స్టేడియం బయట పడింది!

లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపించాడు విండీస్ వీరుడు నికోలస్ పూరన్. ఈ క్రమంలోనే ఓ భారీ పూరన్ బాదిన ఓ భారీ సిక్సర్ స్టేడియం అవతల పడింది. ఈ సిక్స్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇంకో విశేషం ఏంటంటే?

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్ లు చెలరేగారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి లక్నో ఓపెనర్లు డికాక్-కేఎల్ రాహుల్ లు మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్ కు 5.3 ఓవర్లలోనే 53 పరుగులు జోడించారు. మరీ ముఖ్యంగా డికాక్ సూపర్ నాక్ తో అలరించాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో అలరిస్తూ.. సెంచరీ వైపు సాగుతున్న డికాక్ ను టోప్లే పెవిలియన్ కు పంపాడు. 56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో 81 రన్స్ చేశాడు డికాక్.

poorn

ఇక ఆ తర్వాత పూరన్ వంతు. క్రీజ్ లోకి వచ్చిన కొద్దిసేపు తన నిదానంగా ఆడిన అతడు.. ఆ తర్వాత జూలు విదిల్చిన సింహంలా చెలరేగిపోయాడు. టోప్లే వేసిన 19వ ఓవర్ లో వరుసగా 3 భారీ సిక్సర్లు బాదాడు. అందులో ఓ సిక్సర్ గ్రౌండ్ అవతల పడింది. ఈ ఓవర్ నాలుగో బంతిని 106 మీటర్ల భారీ సిక్సర్ గా మలిచాడు. ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఇదే లాంగెస్ట్ సిక్సర్. ఇక ఈ సిక్సర్ తో ఐపీఎల్ లో 100 సిక్సులను కంప్లీట్ చేసుకున్నాడు ఈ విండీస్ బ్యాటర్. ఆర్సీబీతో ఇటీవల జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ సైతం 106 మీటర్ల హ్యూజ్ సిక్స్ బాదాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పూరన్ ధనాధన్ ఇన్నింగ్స్ తో కేవలం 21 బంతుల్లో ఓ ఫోర్, 5 సిక్సు లతో 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో 5 వికెట్లకు 181 రన్స్ చేసింది లక్నో. అనంతరం 182 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఊహించని షాకిచ్చారు లక్నో బౌలర్లు. 43 పరుగులకే 3 కీలక వికెట్లను తీశారు. కోహ్లీ(22), డుప్లెసిస్(19), మాక్స్ వెల్(0)లను తక్కువ పరుగులకే పెవిలియన్ చేర్చారు.

ఇదికూడా చదవండి: Virat Kohli: టీ20 వరల్డ్ కప్ 2024 కోహ్లీ ఆడటం పక్కా! ఇదిగో ప్రూఫ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి