iDreamPost
android-app
ios-app

IPL 2024: బ్రూక్ ప్లేస్ లో ఢిల్లీ టీమ్ లోకి వెన్నులో వణుకు పుట్టించే బౌలర్!

  • Published Apr 08, 2024 | 1:20 PM Updated Updated Apr 08, 2024 | 1:20 PM

ఓటమి బాధలో ఉన్న ఢిల్లీకి ఓ గుడ్ న్యూస్ అందింది. జట్టులోకి ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించే బౌలర్ వస్తున్నాడు. మరి ఆ బౌలర్ ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓటమి బాధలో ఉన్న ఢిల్లీకి ఓ గుడ్ న్యూస్ అందింది. జట్టులోకి ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించే బౌలర్ వస్తున్నాడు. మరి ఆ బౌలర్ ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Apr 08, 2024 | 1:20 PMUpdated Apr 08, 2024 | 1:20 PM
IPL 2024: బ్రూక్ ప్లేస్ లో ఢిల్లీ టీమ్ లోకి వెన్నులో వణుకు పుట్టించే బౌలర్!

ఐపీఎల్ 2024 సీజన్ లో దారుణ ప్రదర్శనతో విమర్శల పాలవుతోంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి.. 2 పాయింట్లతో అట్టడుగున ఉంది. ఇక నిన్న ముంబైతో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో 235 పరుగులను ఛేదించే క్రమంలో 205 రన్స్ వద్ద ఆగిపోయి 29 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఓటమి బాధలో ఉన్న ఢిల్లీకి ఓ గుడ్ న్యూస్ అందింది. జట్టులోకి ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించే బౌలర్ వస్తున్నాడు. మరి అతడెవరు? మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై కంటే దారుణమైన ప్రదర్శన ఇస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్. జట్టు నిండా స్టార్ ప్లేయర్లు కనిపిస్తున్నప్పటికీ.. వారు ఏ మాత్రం రాణించడం లేదు. బ్యాటర్ల సంగతి అటుంచితే.. ఇక బౌలర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, రిచర్డ్సన్, అక్షర్ పటేల్, నోర్ట్జేలు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. వికెట్లు తీయడం అటుంచితే.. కట్టుదిట్టంగా బంతులు వేయడంలో విఫలం అవుతున్నారు ఈ బౌలర్లు. ఇలాంటి టైమ్ లో ఢిల్లీ టీమ్ కు ఓ గుడ్ న్యూస్ అందింది.

ఢిల్లీ టీమ్ లోకి సౌతాఫ్రికా పేసర్ లిజాడ్ విలియమ్సన్ వస్తున్నాడు. హ్యారీ బ్రూక్ ప్లేస్ లో ఇతడిని జట్టులోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక లిజాడ్ విలియమ్సన్ విషయానికి వస్తే.. పదునైన పేస్, స్వింగ్ అతడి బలం. అదీకాక తన తెలివితో స్లో బాల్స్ సంధించి బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు. సౌతాఫ్రికా తరఫున ఆడింది తక్కువ మ్యాచ్ లే అయినప్పటికీ.. మంచి బౌలర్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. లిజాడ్ విలియమ్సన్ రెండు టెస్టుల్లో 3 వికెట్లు, 4 వన్డేల్లో 5, 11 టీ20ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. మరి ఈ బౌలర్ అయినా ఢిల్లీ తలరాత మారుస్తాడో? లేదో? చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş