iDreamPost

IPL 2024లో తొలి విజయంతోనే చరిత్ర సృష్టించిన ముంబై! ప్రపంచంలోనే తొలి టీమ్‌గా..

  • Published Apr 08, 2024 | 8:54 AMUpdated Apr 08, 2024 | 8:54 AM

Mumbai Indians, IPL 2024; హార్ధిక్‌ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌ చరిత్ర సృష్టించింది. ఈ సీజన్‌లో తొలి విజయం దక్కించుకున్న ఆ జట్టు.. ఈ విజయంతోనే కొన్ని అద్భుతమైన రికార్డులను తమ ఖాతాల్లో వేసుకుంది. మరి ఆ రికార్డులేంటో ఇప్పుడు చూద్దాం..

Mumbai Indians, IPL 2024; హార్ధిక్‌ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌ చరిత్ర సృష్టించింది. ఈ సీజన్‌లో తొలి విజయం దక్కించుకున్న ఆ జట్టు.. ఈ విజయంతోనే కొన్ని అద్భుతమైన రికార్డులను తమ ఖాతాల్లో వేసుకుంది. మరి ఆ రికార్డులేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 08, 2024 | 8:54 AMUpdated Apr 08, 2024 | 8:54 AM
IPL 2024లో తొలి విజయంతోనే చరిత్ర సృష్టించిన ముంబై! ప్రపంచంలోనే తొలి టీమ్‌గా..

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. హార్ధిక్‌ పాండ్యా కెప్టెన్సీలో తొలి మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన ముంబై.. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, టిమ్‌ డేవిడ్‌, షెఫర్డ్‌లు రాణించడంతో ముంబైకి భారీ స్కోర్‌ దక్కింది. ఈ టార్గెట్‌ను ఛేజ్‌ చేయడంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ విఫలమైంది. అయితే.. ఈ సీజన్‌లో తొలి విజయం సాధించిన ముంబై.. తమ ఖాతాలో ఓ అరుదైన రికార్డును వేసుకుంది. పైగా అది అలాంటి ఇలాంటి రికార్డు కాదు. ఏకంగా వరల్డ్‌ రికార్డును నమోదు చేసింది ఎంఐ. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఢిల్లీపై సాధించిన విజయంతో ముంబై ఇండియన్స్‌ టీ20ల్లో 150 విజయాలను పూర్తి చేసుకుంది. ఇలా టీ20ల్లో 150 మార్క్‌ విన్‌ను అందుకున్న మొట్టమొదటి టీమ్‌గా ముంబై నిలిచి చరిత్ర సృష్టించింది. అత్యధిక టీ20 విజయాల జాబితాలో ముంబై ఇండియన్స్(150), చెన్నై సూపర్ కింగ్స్(148), టీమిండియా(144), లంకషైర్(143), నాటింగ్‌హమ్‌షైర్(143) ఉన్నాయి. టాప్‌ 5 జాబితాలో టాప్‌ 2లో రెండు ఐపీఎల్‌ టీమ్స్‌ ఉండటం విశేషం. పైగా మూడో స్థానంలో టీమిండియా ఉండటం అందర్ని కాస్త ఆశ్చర్యపరిచే విషయమే. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్స్‌, ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ మ్యాచ్‌లు చూసుకున్నా.. టాప్‌లో ముంబైనే ఉంది. ఈ రికార్డుతో పాటు మరో విచిత్రమైన రికార్డును కూడా ముంబై ఇండియన్స్‌ సాధించింది.

Mumbai created history with the first win in IPL 2024!

టీ20 క్రికెట్ చరిత్రలో జట్టులోని ఒక్క ప్లేయర్‌ కూడా హాఫ్ సెంచరీ చేయకుండా 234 పరుగులు చేసిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీ టీమ్ సోమర్‌సెట్ రికార్డును తుడిచిపెట్టేసింది. 2018లో ఆ జట్టులో ఒక్క ప్లేయర్‌ కూడా హాఫ్ సెంచరీ చేయకుండా 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్‌లో ఒకే వేదికలో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన టీమ్‌గా కూడా ముంబై ఇండియన్స్ నిలిచింది. వాంఖడే వేదికగా ఆ జట్టు 50 విజయాలు నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలో 14 సార్లు 200 ప్లస్ రన్స్‌ను కాపాడుకుంది ముంబై. 200 ప్లస్ రన్స్ చేసి ఎంఐ ఎప్పుడూ ఓడిపోలేదు. మరి ఈ సీజన్‌లో తొలి విజయంతోనే ఇన్ని రికార్డులు నమోదు చేసిన ముంబై ఇండియన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి