iDreamPost
android-app
ios-app

IPL 2024: ఒకవైపు గెలుపు.. మరోవైపు షాకింగ్ న్యూస్! పాపం KKR..

  • Published Apr 04, 2024 | 8:27 PM Updated Updated Apr 04, 2024 | 8:27 PM

వరుస విజయాలతో జోష్ లో ఉండగానే కేకేఆర్ కు ఊహించని షాక్ తగిలింది. దీంతో అయ్యో పాపం అంటున్నారు అభిమానులు. ఇంతకీ ఏం జరిగిందంటే?

వరుస విజయాలతో జోష్ లో ఉండగానే కేకేఆర్ కు ఊహించని షాక్ తగిలింది. దీంతో అయ్యో పాపం అంటున్నారు అభిమానులు. ఇంతకీ ఏం జరిగిందంటే?

IPL 2024: ఒకవైపు గెలుపు.. మరోవైపు షాకింగ్ న్యూస్! పాపం KKR..

కోల్ కత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2024లో తన జైత్రయాత్రను కొనసాగిస్తూ దూసుకెళ్తోంది. వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి నిలిచింది. లేటెస్ట్ గా ఢిల్లీ క్యాపిటల్స్ తో వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఏకంగా 106 పరుగులుతో విజయం సాధించింది. అయితే గెలుపు జోష్ లో ఉండగానే కేకేఆర్ కు ఊహించని షాక్ తగిలింది. దీంతో అయ్యో పాపం అంటున్నారు అభిమానులు. ఇంతకీ ఏం జరిగిందంటే?

వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీపై అద్భుతమైన విజయాన్ని సాధించింది కోల్ కత్తా టీమ్. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 272 పరుగుల రికార్డ్ స్కోర్ ను నమోదు చేసింది. సునీల్ నరైన్(85) మెరుపు బ్యాటింగ్ కు తోడు.. అరంగేట్ర ప్లేయర్ రఘువంశీ దంచికొట్టాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 166 రన్స్ కే కుప్పకూలి 106 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే గెలుపుతో ఫుల్ జోష్ లో ఉన్న కేకేఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు యంగ్ పేసర్ హర్షిత్ రాణా గాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో బాల్ ను ఆపే క్రమంలో అతడి కుడి భుజానికి గాయమైంది. దీంతో హర్షిత్ మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్ ను వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ ఫీల్డింగ్ కు రాలేదు. కనీసం ఈ మ్యాచ్ లో ఒక్క ఓవర్ కూడా వేయలేదు.

shock to kkr

ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత రాణాను స్కానింగ్ నిమిత్తం హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే అతడి గాయం గురించి ఇప్పటి వరకైతే ఎలాంటి అప్డేట్ రాలేదు. గాయం తీవ్రమైనది అయితే.. నెక్ట్స్ మ్యాచ్ తో పాటుగా మరిన్ని మ్యాచ్ లకు దూరమైయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి పేస్ బౌలింగ్ కలిగి ఉన్న రాణా మూడు మ్యాచ్ ల్లో 5 వికెట్లు పడగొట్టాడు. ఒకవేళ గాయం పెద్దదై అతడు దూరమైతే.. కేకేఆర్ కు పెద్ద దెబ్బనే చెప్పాలి. ఇక కోల్ కత్తా తర్వాతి మ్యాచ్ ను ఏప్రిల్ 8న చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడనుంది.

marsbahis girişjojobet