Jos Buttler: ఈ అద్భుత ఇన్నింగ్స్ కు కారణం ధోని, కోహ్లీలే.. బట్లర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

KKRతో జరిగిన మ్యాచ్ లో తన అసాధారణ బ్యాటింగ్ కు కారణం విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోని అని చెప్పి అందరికి షాకిచ్చాడు జోస్ బట్లర్. అతడు ఎందుకు అలా చెప్పాడు? ఆ వివరాల్లోకి వెళితే..

KKRతో జరిగిన మ్యాచ్ లో తన అసాధారణ బ్యాటింగ్ కు కారణం విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోని అని చెప్పి అందరికి షాకిచ్చాడు జోస్ బట్లర్. అతడు ఎందుకు అలా చెప్పాడు? ఆ వివరాల్లోకి వెళితే..

ఈ ఐపీఎల్ సీజన్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. రోజురోజుకు మ్యాచ్ లు రసవత్తరంగా మారుతున్నాయి. మెున్న ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ లో రికార్డ్ స్కోర్ నమోదైతే.. నిన్న రాజస్తాన్-కోల్ కత్తా మ్యాచ్ ప్రేక్షకులను థ్రిల్లింగ్ కు గురిచేసింది. కోల్ కత్తా విధించిన 224 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది సంజూ శాంసన్ సేన. కష్ట సాధ్యం అనుకున్న టార్గెట్ ను దంచికొట్టడంలో జోస్ బట్లర్ పాత్ర కీలకమైంది. రికార్డ్ సెంచరీతో తన టీమ్ కు ఊహించని విక్టరీని అందించాడు. అయితే తన అసాధారణ బ్యాటింగ్ కు కారణం విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోని అని చెప్పి అందరికి షాకిచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

జోస్ బట్లర్.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపుతున్న ఆటగాడు. ఇటీవలే ఆర్సీబీపై సూపర్ సెంచరీ సాధించిన బట్లర్.. తాజాగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో సైతం వీరోచిత శతకంతో ఆర్ఆర్ కు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో 60 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 6 సిక్సులతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి తోడు రోవ్ మన్ పావెల్ 13 బంతుల్లో 3 సిక్సులు, ఓ ఫోర్ తో 26 పరుగులు చేశాడు. దీంతో 2 వికెట్ల తేడాతో ఆర్ఆర్ చివరి బంతికి గెలిచింది. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన బట్లర్ తాను ఈ విధంగా బ్యాటింగ్ చేయడానికి కారణం విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని అని చెప్పుకొచ్చాడు.

కేకేఆర్ పై విజయం సాధించిన తర్వాత జోస్ బట్లర్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బట్లర్ మాట్లాడుతూ..”నేను ఈ విధంగా చివరి వరకు ఉండి చెలరేగడానికి కారణం ఇద్దరు ఉన్నారు. వారే విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోని.వీరిద్దరు గేమ్ లో చివరి బాల్ వరకు క్రీజ్ లో ఉండి జట్టును గెలిపించడానికి చూస్తారు. వారిని చూసే నేను ఈ రోజు ఇలా బ్యాటింగ్ చేశాను. కోహ్లీ, ధోనిలు మ్యాచ్ ను ఎలా ముగిస్తారో చూసి.. నేను ఈరోజు అప్లై చేశాను అంతే” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో విరాట్ ఫ్యాన్స్, ధోని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. వరల్డ్ క్రికెట్ లో కోహ్లీ, ధోని లెజెండ్స్ అని మరోసారి రుజువైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి బట్లర్ తన ఆటకు కోహ్లీ, ధోని కారణమన్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments